TFCC Elections 2023: తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలిపించాయి. సి. కళ్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ బరిలో దిగాయి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అయితే ఎన్నికల్లో దిల్ రాజుదే పై చేయి అయ్యింది. దిల్ రాజు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇక వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్‌గా ప్రసన్న కుమార్ ఎలెక్ట్ అయ్యారుఅధ్యక్ష పదవికి దాదాపు 25 కోట్లు కావాలి. 48 ఓట్లలో దిల్ రాజుకి 31 ఓట్లు పడ్డాయి. అంటే సి. కళ్యాణ్ మీద భారీ మెజారిటీతో ఆయన గెలిచారు.
జులై 30న జరిగిన ఎన్నికల్లో దిల్ రాజు, సి కళ్యాణ్ ప్యానెల్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లు ఎన్నికలు నడిచాయి. 14 రౌండ్స్‌లో 891 ఓట్స్ పోల్ అయ్యాయి. వీటిలో దిల్ రాజుకు 563 పడ్డాయి. ఇక ప్రత్యర్థి సి.కల్యాణ్‌కు 497 ఓట్లు పడ్డాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లోని 12 మందిలో దిల్‌రాజు ప్యానల్ నుంచి ఏడుగురు అభ్యర్ధులు ఎన్నిక కావడమైంది. ఇక స్టూడియో సెక్టార్ నుంచి గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో దిల్ రాజు అభ్యర్థులు 6 గురు విజయం సాధించారు. మరో ఆరుగురు సి. కళ్యాణ్ ప్యానెల్ నుండి గెలిచారు.
రెండేళ్లకోసారి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరుగుతాయి. 2023-25 కాలానికి దిల్ రాజు అధ్యక్షుడు అయ్యాడు. ఈ రెండేళ్లలో నిర్మాతలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పడమైంది. ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తీవ్ర పోటీ ఏర్పడినందుకు సంతోషించాలో బాధపడాలో తెలియడం లేదన్నారు. ఎన్నికల ప్రచారం జరిగిన తీరు దారుణం అన్నారు.
కాగా ఎన్నికలకు ముందు సి. కళ్యాణ్ దిల్ రాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ కౌన్సిల్ డబ్బులు దోచేస్తుంది అన్నారు. దిల్ రాజుకు తన వ్యాపారం తప్పితే పరిశ్రమ శ్రేయస్సు ముఖ్యం కాదన్నారు. మీరు సమస్యల్లో ఉంటే వెంటనే స్పందించే వ్యక్తిని ఎన్నుకోండని కోరారు. సి. కళ్యాణ్ ఆరోపణలు దిల్ రాజు గెలుపును ఆపలేకపోయాయి.