Homeఎంటర్టైన్మెంట్Dil Raju Brother: గేమ్ చేంజర్ ఫెయిలైనా.. చరణ్ ఎందుకు పట్టించుకోలేదు? - నిర్మాత శిరీష్

Dil Raju Brother: గేమ్ చేంజర్ ఫెయిలైనా.. చరణ్ ఎందుకు పట్టించుకోలేదు? – నిర్మాత శిరీష్

Dil Raju Brother: దిల్ రాజు(Dil Raju) సోదరుడు,మరియు అతని వర్కింగ్ పార్టనర్ శిరీష్(Sireesh) నిన్న ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ పెను దుమారం రేపింది. ఇండస్ట్రీ లో జరిగే సంఘటనల గురించి ఇంత బహిరంగంగా మాట్లాడిన వ్యక్తులను బహుశా మనం ఎక్కడా చూసి ఉండము. దిల్ రాజు అందుకే ఇన్ని రోజులు ఇతన్ని ఇంటర్వ్యూస్ కి రానివ్వకుండా ఆపాడేమో అని అనిపిస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈయన ఇంటర్వ్యూ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గేమ్ చేంజర్(Game Changer Movie) చిత్రం ఫ్లాప్ అయితే హీరో రామ్ చరణ్(Global Star Ram Charan), డైరెక్టర్ శంకర్ మమ్మల్ని అసలు పట్టించుకోలేదని,కనీసం ఫోన్ చేసి పరిస్థితి ఎలా ఉంది అని కూడా అడగలేదని బోల్డ్ కామెంట్స్ చేసాడు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం లేకపోతే మా బ్రతుకు రోడ్డున పడేది అని, అనిల్ రావిపూడి వల్లనే మా సంస్థ ఈరోజు ఇలా నిలబడిందని చెప్పుకొచ్చాడు.

Also Read: Tammudu Release Trailer: తమ్ముడు రిలీజ్ ట్రైలర్ లో అది ఒకే…కానీ ఆ ఒక్కటి మైనస్..గమనించారా..?

ఇదే ఇంటర్వ్యూ లో శిరీష్ మాట్లాడిన మాటలు చూస్తుంటే, మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) మీద అతనికి ఉన్న ద్వేషం ఎలాంటిదో అర్థం అవుతుంది. ఆయన మాట్లాడుతూ ‘మైత్రీ మూవీ మేకర్స్ కి, సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) కి మధ్య నక్కకి, నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నక్క..సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ నాగలోకం వంటి వాడు అంటూ చెప్పుకొచ్చింది. నాగ వంశీ బయ్యర్స్ గురించి ఆలోచించే అతి తక్కువ మందిలో ఒకడు. అతన్ని దగ్గరుండి చూసిన వాడిగా చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు శిరీష్. మైత్రీ మూవీ మేకర్స్ ఒకపక్క నిర్మాణం పరంగా,మరో పక్క డ్రిస్ట్రిబ్యూషన్ పరంగా అతి తక్కువ సమయంలోనే ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకి ఎదిగింది. మైత్రీ మూవీ మేకర్స్ ఎదుగుదల దిల్ రాజు క్యాంప్ కి అసలు ఇష్టం లేదని మార్కెట్ లో ఎప్పటి నుండో ఒక టాక్ ఉంది. నిన్న శిరీష్ మాటలతో అది నిజమే అని అందరికీ అర్థమైపోయింది.

Also Read: Megastar Chiranjeevi Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి..ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వనున్న టీం?

గతంలో నైజాం మరియు వైజాగ్ ప్రాంతాల్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు సంబంధించిన సినిమాలు మొత్తం దిల్ రాజు కే డిస్ట్రిబ్యూషన్ వెళ్ళేవి. రెండు ప్రొడక్షన్స్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. ఎప్పుడైతే మైత్రీ మూవీ మేకర్స్ నైజాం ప్రాంతం లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మొదలు పెట్టారో,అప్పటి నుండి దిల్ రాజు తో ట్రేడ్ పరంగా విబేధాలు మొదలయ్యాయి. తాము ఇప్పుడూ ఒకరి మంచిని మాత్రమే కోరుకునే వాళ్లమని, అప్పట్లో వరంగల్ శ్రీను మా మీద ఎలా నోరుపారేసుకున్నాడో మీరంతా చూసారని, కానీ అతనికి కూడా సహాయం చేసిన గొప్ప మనసు మాకుందని చెప్పుకొచ్చాడు శిరీష్. లైగర్ సినిమా కోసం అతనికి చాలా డబులు ఇచ్చామని, సినిమా ఫ్లాప్ అయ్యి ఘోరమైన డిజాస్టర్ అయితే ఇప్పటి వరకు మేము మా డబ్బులు అడిగి తీసుకోలేదు అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular