Ram Pothineni: స్టార్ హోటల్స్ లో ఉండే సెలబ్రిటీలకు కూడా రక్షణ కొరవడుతుందా?..మద్యం సేవించిన ఆకతాయిలు నేరుగా ఒక ప్రముఖ సినీ సెలబ్రిటీ నిద్రిస్తున్న రూమ్ లోకి వెళ్లేంతగా రక్షణ కొరవడిందా?, హీరో రామ్(Ram Pothineni) కి ప్రస్తుతం రాజమండ్రి లో అలాంటి సంఘటనే ఎదురైంది. ప్రస్తుతం ఆయన ‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Thaluka) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో కూడా విడుదలైంది. ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు(P.Mahesh Babu) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక అభిమాని బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో రామ్ ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కి వీరాభిమాని గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల నుండి రాజమండ్రి లో జరుగుతుంది. హీరో రామ్ రాజమండ్రి లోని ఒక ప్రైవేట్ హోటల్ లో గత కొంత కాలంగా బస చేస్తున్నాడు.
Also Read: తమ్ముడు రిలీజ్ ట్రైలర్ లో అది ఒకే…కానీ ఆ ఒక్కటి మైనస్..గమనించారా..?
అయితే రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన రామ్ ని, మూవీ టీం ని,హోటల్ సిబ్బందిని కలవర పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న రాత్రి పది గంటలకు బాగా మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు రామ్ బస చేస్తున్న హోటల్ వద్దకు వచ్చి, తాము హీరో టీం కి సంబంధించిన వాళ్ళము అని చెప్పి లిఫ్ట్ యాక్సస్ తీసుకొని రామ్ VIP గెస్ట్ గా ఉంటున్న హోటల్ లోని ఆరవ ఫ్లోర్ లోకి ప్రవేశించారు. అక్కడ ఫ్లోర్ క్లీనింగ్ చేస్తున్న సిబ్బంది ని ఇబ్బంది పెట్టి లోపలకు ప్రవేశించి రామ్ ఉంటున్న గదిని బలంగా కొట్టారు. అప్పటికే మంచి నిద్రలో ఉన్న రామ్ ఉలిక్కపడి లేచి ఎవరు ఇలా తలుపులు కొడుతున్నారు అంటూ హోటల్ మ్యానేజ్మెంట్ కి సమాచారం అందించాడు. ఆ తర్వాత వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ఇద్దరు ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు.
హోటల్ యాజమాన్యం ఈ ఘటన పై పోలీసులకు లిఖిత పూర్వకంగా కంప్లైంట్ రాసి ఇచ్చారు. వాళ్లిద్దరూ ఆ సమయం లో మద్యం సేవించి వచ్చినట్టుగా తేల్చారు. అయితే ఈ ఇద్దరు ఏ ఉద్దేశ్యంతో హోటల్ లోపలకు అడుగుపెట్టారు?, రామ్ ని ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేశారా?,లేకపోతే అభిమానం తో ఎలా అయినా తమ అభిమాన హీరో ని చూడాలనే తపన తో ఇలా చేశారా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. అయితే హోటల్ యాజమాన్యం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో దారిలో పొయ్యే దానయ్య వచ్చి మేము హీరో గారి తాలూకా అంటే పైకి పంపించేస్తారా?, ముందు వెనుక చూసుకోరా?,ఇలా ఉంటే స్వేచ్ఛగా హీరో గా మీద కక్ష్య ఉన్నోళ్లు కూడా లోపలకు వెళ్లి దాడి చేసే అవకాశం ఉంటుంది కదా?, ఇది పూర్తిగా హోటల్ యాజమాన్యం అసమర్థత గానే భావించాలి.