Dil Raju Allu Arjun movie update: ‘పుష్ప'(Pushpa Movie) కి ముందు, ఆ తర్వాత అల్లు అర్జున్(Icon Star Allu Arjun) రేంజ్ ఎలా మారిపోయిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. అంతకు ముందు వరకు ఆయనకీ దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నప్పటికీ, ప్రాంతీయ బాషా హీరోగానే కొనసాగాడు. ‘పుష్ప’ తర్వాత ఓవర్ నైట్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఇక గత ఏడాది విడుదలైన ‘పుష్ప 2′(Pushpa 2 Movie) తో అయితే బాలీవుడ్ లో ఏకంగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ స్థానాలకే ఎసరు పెట్టాడు. అయితే పుష్ప కి ముందు అల్లు అర్జున్ నలుగురు దర్శకులతో సినిమాలు చేయడానికి సంతకాలు చేసాడు. అందులో కొరటాల శివ సినిమా ఒకటి. ఆ సినిమానే ‘దేవర’. పుష్ప చిత్రానికి ఎక్కువ సమయం కేటాయించకపోవడం వల్ల ఈ చిత్రం అల్లు అర్జున్ చేతుల్లో నుండి ఎన్టీఆర్ చేతికి వెళ్ళింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే.
ఇక అల్లు అర్జున్ ఓకే చేసిన మరో ప్రాజెక్ట్ AR మురగదాస్ తో. గీత ఆర్ట్స్ సంస్థ లో ఈ చిత్రాన్ని నిమరించాలని అనుకున్నారు. కానీ పుష్ప కారణంగా ఇది కూడా పోయింది. అదే విధంగా తమిళ డైరెక్టర్ లింగు స్వామి తో కూడా ప్రాజెక్ట్ ని అప్పట్లో గ్రాండ్ ఈవెంట్ ని చేసి ప్రకటించారు. ఇది కూడా ఆగిపోయింది. ఇలా పుష్ప స్క్రిప్ట్ కోసం అల్లు అర్జున్ ఈ సినిమాలంటిని పక్కన పెట్టేసాడు. ఇదంతా పక్కన పెడితే గతంలో వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వం లో ‘ఐకాన్’ అనే చిత్రాన్ని ప్రకటించాడు అల్లు అర్జున్. ఈ సినిమాకు దిల్ రాజు(Dil Raju) నిర్మాత . బహుశా అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అనే బిరుదుని ఈ సినిమా టైటిల్ ని చూసే పెట్టుకొని ఉండొచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఉంటుందా లేదా అనే విషయం పై నిర్మాత దిల్ రాజు రీసెంట్ గా తమ్ముడు మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
Also Read: Dil Raju War 2: దిల్ రాజు చేతుల్లోకి ‘వార్ 2′..’కూలీ’ ని తొక్కేయడానికి పెద్ద ప్లానే వేశారుగా!
ఇంటర్వ్యూ లో యాంకర్ దిల్ రాజు ని ప్రశ్న అడుగుతూ ‘ఐకాన్ సబ్జెక్టు అలాగే ఉందా..? అల్లు అర్జున్ తో చేయబోతున్నారా భవిష్యత్తులో’ అని అడగ్గా, దానికి దిల్ రాజు సమాధానం చెప్తూ ‘పుష్ప కి ముందే ఈ ప్రాజెక్ట్ ని మేము ప్రకటించాము. కానీ పుష్ప తర్వాత అల్లు అర్జున్ రేంజ్ బాగా పెరిగిపోయింది కదా. ఆ రేంజ్ కి తగ్గట్టే ఆయన భారీ స్పాన్ సినిమాలు తీస్తున్నాడు. ఐకాన్ కూడా భారీ స్పాన్ ఉన్న చిత్రమే. కానీ అట్లీ తో ప్రాజెక్ట్ మొదలు పెట్టేసాడు కాబట్టి ఈ స్క్రిప్ట్ ని ఆయన చెయ్యాలి అనే ఆలోచన విరమించుకున్నాము. తమ్ముడు విడుదల తర్వాత వేణు శ్రీ రామ్ ఆ సినిమా ఫైల్ ని మళ్ళీ బయటకు తియ్యాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.
Currently, we are not considering #AlluArjun for the ICON movie
– #DilRaju pic.twitter.com/Ajb1ipmLCQ— ᴧı ẞᴧı️ (@davidbhaionline) June 23, 2025