Ind Vs Eng 2nd Test: తొలి టెస్ట్ లో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బౌలర్లు. వికెట్లు తీయాల్సిన సందర్భంలో భారత బౌలర్లు చేతులెత్తేశారు.. ఏకంగా ఐదు శతకాలు నమోదు చేసినప్పటికీ.. 300 కు మించి పరుగుల లక్ష్యాన్ని విధించినప్పటికీ భారత్ ఓడిపోయిందంటే ఎంత దారుణంగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బౌలర్లు ఏమాత్రం సత్తా చూపించలేకపోతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు వికెట్లు పడగొట్టినచోట భారత బౌలర్లు తేలిపోతున్నారు. ఇక అత్యంత దారుణంగా పరుగులు ఇస్తున్నారు. ఆడుతున్నది సుదీర్ఘ ఫార్మాట్ అనే విషయం మర్చిపోయి బౌలింగ్ వేస్తున్నారు. ద్వారా ఆతిథ్య జట్టు ఆటగాళ్లు దుమ్ము రేంజ్ లో పరుగులు తీస్తున్నారు. మొదటి టెస్టులో ఓటమి నేపథ్యంలో టీమిండియా జట్టుకూర్పు పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వదిలిపెట్టి .. ఐపీఎల్ లో ఆడిన ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వడం పట్ల జట్టు మేనేజ్మెంట్ పై ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగానే టీమిండియా కు మరో షాక్ తగిలింది.
టీమిండియా బౌలింగ్ దళం ప్రస్తుతం అత్యంత పేలవంగా ఉంది. బౌలింగ్ సమస్య ఓవైపు ఇబ్బంది పెడుతుంటే.. మరోవైపు రెండో టెస్టు ప్రారంభానికి ముందు టీమ్ ఇండియాకు షాకింగ్ లాంటి వార్త ఎదురైంది. టీమిండియా పదునైన ఆయుధం బుమ్రా రెండవ టెస్టులో ఆడేది అనుమానమేనని తెలుస్తోంది. అతడి స్థానంలో అర్ష్ దీప్ సింగ్ ను జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది.. బుమ్రా మీద ఒత్తిడి తగ్గించడానికి రెండో టెస్టులో అతడు ఆడకుండా విశ్రాంతి ఇస్తున్నారని తెలుస్తోంది. అర్ష్ దీప్ సింగ్ తొలి టెస్ట్ లో రిజర్వు బెంచ్ కు పరిమితమయ్యాడు. అయితే అతడికి రెండో టెస్టులో అవకాశం కల్పించి.. బుమ్రా కు విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది.. మొదటి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో బుమ్రా తో ఎక్కువ శాతం బౌలింగ్ వేయించలేదు. పైగా అతడు రెండవ వికెట్లు కూడా సాధించలేకపోయాడు. దీంతో అతడికి విశ్రాంతి ఇచ్చి ప్రసిద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, సిరాజ్ తో మాత్రమే బౌలింగ్ వేయించారు.. అయితే బుమ్రా కట్టదిట్టంగా బౌలింగ్ వెయ్యకపోవడం కూడా టీమిండియా విజయాన్ని ప్రభావితం చేసింది. మరోవైపు బుమ్రా రెండో టెస్టుకు దూరమైతే అది కచ్చితంగా టీం ఇండియాకు దెబ్బే. ఎందుకంటే తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా ఐదు వికెట్లు సాధించాడు. తోటి బౌలర్లు తేలిపోతున్నచోట అతడు అదరగొట్టాడు. ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉన్న అతడు రెండవ టెస్ట్ ఆడకపోతే.. టీమిండియా మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడాన్ని టీమిండియా లెజెండరీ ఆటగాడు రవి శాస్త్రి తప్పుపట్టాడు. ఇలా అతడిని విశ్రాంత గదికి పరిమితం చేస్తే రెండో టెస్టులో టీమిండియా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.