మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’తో విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ రూపొందనున్న సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. సెప్టెంబరు 14 నుంచి ఈ సినిమాని ప్రారంభిస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న దిల్‌రాజు దంపతులు.. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘రౌడీబాయ్, థ్యాంక్యూ, పాగల్ చిత్రాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయన్నారు. అలాగే కరోనా కారణంగా వాటి రిలీజ్ ఇంకా లేటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ‘ఎఫ్-3’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని.. అలాగే అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమాను కూడా త్వరలో ప్రారంభిస్తామని దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.
మొత్తానికి చరణ్ – శంకర్ సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూస్తోన్న మెగా అభిమానుల ఎదురుచూపులకు ఫలితం దక్కింది. అన్నట్టు ఈ పాన్ ఇండియా మూవీకి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు. అలాగే అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతాన్ని అందించనున్నాడు.
అందుకే నేషనల్ వైడ్ గా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నిటికీ మించి చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తోన్న సినిమా ఇది. ఒక విధంగా బడ్జెట్ విషయంలో కూడా దిల్ రాజు ఎలాంటి ఆంక్షలు లేకుండా సినిమా చేయడానికి ఉత్సాహ పడుతుంది కూడా అందుకే. మరి మెగా అభిమానులు ఈ సినిమా ఏ రేంజ్ కిక్ ఇస్తోందో చూడాలి.