Game changer in OTT : భారీ చిత్రాల దర్శకుడు శంకర్(Shankar) తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్(Game Changer). సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. రామ్ చరణ్(Ram Charan) ఈ మూవీలో మూడు భిన్నమైన పాత్రలు చేశాడు. రాజకీయ నాయకుడు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్రల్లో నటించి మెప్పించాడు. రామ్ చరణ్ తనకు ప్రశంసలు దక్కుతున్నాయి. శంకర్ దర్శకత్వం విమర్శలు ఎదుర్కొంటుంది. కథ, కథనాలు ఆకట్టుకోలేదు. శంకర్ మార్క్ ఎమోషన్స్ గేమ్ ఛేంజర్ లో మిస్ అయ్యాయి. మొత్తంగా శంకర్ అవుట్ డేటెడ్ అయిపోయాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా సెకండ్ హాఫ్ లో అప్పన్నగా రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అద్భుతంగా ఉందని మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం.
గేమ్ ఛేంజర్ నుండి విడుదలైన పాటల్లో ‘నానా హైరానా’ విపరీతమైన ఆదరణ పొందింది. అనూహ్యంగా సాంకేతిక కారణాలతో ఆ పాటను సినిమా నుండి తొలగించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసిన పాట, సినిమా లేదంటూ ప్రేక్షకులు శంకర్ పై మండిపడుతున్నారు. టాక్ ఎలా ఉన్నా.. గేమ్ ఛేంజర్ కి ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. పండగ నేపథ్యంలో చెప్పుకోదగ్గ వసూళ్ళు రాబడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడనే చర్చ మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ ధర చెల్లించి గేమ్ ఛేంజర్ మూవీ హక్కులు దక్కించుకుందట. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిందట. గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్ రూ. 104 కోట్లు పలికాయని సమాచారం.
ఇక డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడనగా… సాధారణంగా మూవీ థియేట్రికల్ రిలీజ్ తేదీ నుండి నాలుగు వారాల అనంతరం ఓటీటీలో అందుబాటులోకి తెస్తారు. మూవీ ఫలితం ఆధారంగా ఇది డ్యూరేషన్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఒక అంచనా ప్రకారం గేమ్ ఛేంజర్ ఫిబ్రవరి రెండో వారం లేదా చివరి వారాల్లో స్ట్రీమ్ కావచ్చు. రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటించగా, దిల్ రాజు నిర్మించాడు.
Web Title: Digital platform amazon prime has reportedly acquired the rights to the game changing movie for a whopping rs 104 crore
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com