
Rakul Preet Singh : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి రకుల్ ప్రీత్ సింగ్.ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ తో తప్ప దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈమె.అది కూడా అతి తక్కువ సమయంలోనే,తెలుగులో కెరటం అనే చిత్రం ద్వారా వెండితెరకి పరిచయమైనా రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం తో భారీ హిట్ కొట్టింది.
ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.తెలుగు మరియు తమిళం బాషలలో వరుసగా స్టార్ హీరోల సరసనే నటించింది.అలా కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సమయం లో ఈమెకి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి, దాంతో ఈమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.అక్కడ కూడా ఈమెకి కలిసిరాకపోవడం తో ఇప్పుడు టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.
రెమ్యూనరేషన్ ని సగానికి పైగా తగ్గించుకోవడమే కాకుండా, ఎలాంటి పాత్ర ఇచ్చినా నటించడానికి సిద్ధం అంటుంది రకుల్ ప్రీత్ సింగ్.దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి అన్నట్టుగా రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చూస్తే అయ్యో ఇంత పెద్ద హీరోయిన్ కి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి అని జాలి కలుగుతుంది.
ప్రస్తుతం ఈమె చేతిలో ఒక హిందీ సినిమా, మరియు రెండు తమిళ సినిమాలు ఉన్నాయి.తమిళం లో ఈమె నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటి ఇండియన్ 2.సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ ప్రాజెక్ట్ భారీ హిట్ అయితే మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ జాతకం మారే అవకాశం కూడా ఉంది, ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ఈ చిత్రం పైనే ఉన్నాయి.