
Ram Charan – IPL team : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.#RRR చిత్రం తో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది,మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటికీ, తండ్రిని మించిన తనయుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.కేవలం సినీ రంగం లో మాత్రమే కాదు, వ్యాపార రంగం లో కూడా రామ్ చరణ్ గొప్పగా రాణిస్తున్నాడు.
అప్పట్లో ఈయన ఒక పోలో టీం ని కొనుగోలు చేసాడు, ఆ తర్వాత స్పైస్ జెట్ అని ఎయిర్ వేస్ రంగం లోకి అడుగుపెట్టాడు.రెండు కూడా విజయవంతమైనవే, ఇప్పుడు లేటెస్ట్ గా మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు రామ్ చరణ్.ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న వార్త ఏమిటంటే వచ్చే ఏడాది రామ్ చరణ్ సరికొత్త IPL టీం తో మన ముందుకి రాబోతున్నట్టు తెలుస్తుంది.
‘వైజాగ్ వారియర్స్’ పేరిట ఆయన సరికొత్త IPL టీం ని స్థాపించబోతున్నాడని, దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయని అంటున్నారు.గత ఏడాది నుండి IPL లక్నో మరియు గుజరాత్ టీమ్స్ ఎంట్రీ ఇచ్చాయి.తెలంగాణ ప్రాంతం నుండి ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ టీం ఉంది కానీ, ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించి ఒక్క టీం కూడా లేదు, అందుకే రామ్ చరణ్ వైజాగ్ వారియర్స్ పేరిట ఒక కొత్త IPL టీం తో వచ్చే ఏడాది నుండి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ మరియు కాన్సెప్ట్ వీడియో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.