Dies Irae movie: సౌత్ సినిమా ఇండస్ట్రీలో మలయాళం ఇండస్ట్రీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయడంలో వాళ్ళను మించిన వారు మరెవరు లేరు… మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలు సైతం లో బడ్జెట్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ఉంటారు. డైరెక్టర్ ‘రాహుల్ సదాశివన్’ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భూతకాలం, బ్రమయుగం లాంటి రెండు సూపర్ సక్సెస్ లను అందించిన ఈ దర్శకుడు ఇప్పుడు మోహన్ లాల్ తనయుడు అయిన ప్రణవ్ మోహన్ లాల్ తో ‘డైస్ ఇరే’ అనే సినిమా చేశాడు.ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు మూవీ గురించి చాలా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కారణం ఏంటి అంటే హర్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఈ మాత్రం మెప్పించలేక పోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మ్యూజిక్ తప్పితే మిగతా ఏది కూడా అంత ఎఫెక్టివ్ గా లేదని సౌండ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
కాబట్టి హార్రర్ ఎలిమెంట్స్ కొన్ని వర్కౌట్ అయ్యాయని కూడా తెలుస్తున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ సౌండ్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా మారాయి. అందువల్లే ఈ సినిమాని కాస్త చూడడానికి పెంచిందని చెబుతున్నారు. మరి ఈ సినిమా నిరాశపరిచినప్పటికి ప్రణవ్ యాక్టింగ్ బాగుంది.
ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన హార్రర్ సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించారని జానర్ షిఫ్టింగ్ వల్ల అతని కెరియర్ కి చాలా వరకు హెల్ప్ అవుతుందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా మీద అతని నటన మీద చాలామంది ప్రశంసలైతే కురిపిస్తున్నారు. మలయాళం ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను మెప్పిస్తుంటాయి.
మరి ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందటంలో విఫలమైనట్టుగా తెలుస్తోంది. హార్రర్ గొలిపే ఎలిమెంట్స్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదని కొంతమంది సినిమా విమర్శకులు సైతం విమర్శిస్తున్నారు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ ఈజీగా కనిపెట్టే విధంగా ఉందని స్క్రీన్ ప్లే కూడా అంత ఎఫెక్టివ్ గా లేకపోవడం వల్లే సినిమా నాసిరకంగా తయారైందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…