Producers vs Directors: ఒకప్పుడు ఒక సంవత్సరంలోనే చాలా ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండేవి. స్టార్ డైరెక్టర్స్ ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తూ చాలా బిజీగా వాళ్ల కెరియర్ ని కొనసాగిస్తూ ముందుకు సాగేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఒక సినిమా కోసమే దర్శకులు దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయాన్ని తీసుకుంటున్నారు. దీనివల్ల ఎక్కువ సినిమాలు రాలేకపోతున్నాయి. తద్వారా ప్రొడ్యూసర్లు సైతం ఎక్కువ సంఖ్యలో సినిమాలను చేసే అవకాశమైతే దొరకడం లేదు. ఇక ఇదిలా ఉంటే చాలామంది ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ ఇచ్చి దర్శకులను లాక్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు… చిన్న దర్శకులకైతే ఇబ్బంది లేదు. కానీ స్టార్ డైరెక్టర్లకు అడ్వాన్సు ఇచ్చి లాక్ చేయాలనే ప్రయత్నం చేస్తే వాళ్లు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అడ్వాన్సులు ఇచ్చిన ప్రొడ్యూసర్ల నుంచి విపరీతమైన ఒత్తిడి పెరిగి దర్శకులు ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో పడిపోతున్నారు. ఇక ప్రొడ్యూసర్స్ కూడా మొదట ఒక దర్శకుడి కి అడ్వాన్సు ఇచ్చి ఒక హీరోకి కమిటై సినిమాను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
దీనివల్ల అటు డైరెక్టర్ల నుంచి గాని, ఇటు హీరోల నుంచి గాని ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ ఎక్కువమంది ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకుంటే మాత్రం డైరెక్టర్లకు అదొక నరకమనే చెప్పాలి. ఇంకా ప్రొడ్యూసర్లు సైతం చాలా మంది దర్శకులకు అడ్వాన్సు ఇచ్చి ఆ తర్వాత హీరోలను సెట్ చేసే పనిలో బిజీగా ఉంటున్నారు.
కానీ హీరోలు మాత్రం మంచి కథ దొరికి స్టార్ డైరెక్టర్ ఉంటేనే ప్రొడ్యూసర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కాబట్టి అడ్వాన్స్ ఇవ్వడం ప్రొడ్యూసర్లకి కూడా ఒక తలకాయ నొప్పిగా మారింది. మరి ఇలాంటి సందర్భంలో అటు దర్శకులు ఇటు హీరోలు ఇద్దరు కూడా చాలా తెలివిగా అడ్వాన్స్ లను తీసుకోవడానికి ప్రణాళికలు చేసుకుంటున్నారు. సక్సెస్ వచ్చిన దర్శకులను వెంటనే లాక్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.
స్టార్ డైరెక్టర్లకు ఎక్కువ రెమ్యూనరేషన్ ను ఆఫర్ చేస్తూ కొంతమంది బడా ప్రొడ్యూసర్లు వాళ్ళను లాక్ చేసుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా సినిమా సక్సెస్ మీదనే ప్రతి ఒక్కరి కెరియర్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి సక్సెస్ ఫుల్ దర్శకులకే ఎక్కువ అడ్వాన్సులు ఇవ్వడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఒక సినిమా అడ్వాన్స్ ని తీసుకొని సినిమాను పూర్తి చేసిన తర్వాత మరొక సినిమా అడ్వాన్సు తీసుకుంటే బెటర్ అని దర్శకులు, హీరోలు భావిస్తున్నారు…