https://oktelugu.com/

Allu Arjun Arrested: అల్లు అర్జున్ ని రాత్రంతా జైలులో ఇబ్బంది పెట్టారా..? అసలు రాత్రి ఏమి జరిగింది? సంచలన విషయాలను బయటపెట్టిన లాయర్!

హై కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా రాత్రంతా అల్లు అర్జున్ ని జైలు లో ఎందుకు ఉంచినట్టు?, అసలు ఏమి జరుగుతుంది అని మీడియా రిపోర్టర్స్ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించగా, ఆయన వాటికి చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 14, 2024 / 08:37 AM IST

    Allu Arjun Arrested(22)

    Follow us on

    Allu Arjun Arrested: కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ని పోలీసులు చంచల్ గూడ జైలు నుండి విడుదల చేసిన వార్తని మనం మీడియా లో చూసే ఉంటాము. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ఉందంతం మొత్తం చాలా అన్యాయం గా జరిగిందని, అల్లు అర్జున్ తరుపున న్యాయవాది మీడియా తో అంటున్నాడు. రాత్రంతా అల్లు అర్జున్ ని పోలీసులు మర్యాదతోనే చూసారా?, లేదా ఇబ్బంది పెట్టారా అని మీడియా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకి లాయర్ సమాధానం చెప్తూ ‘అది నేను చూడలేదు కదా..చూడకుండా నేను ఎలా దానిపై స్పందిస్తాను?’ అంటూ చెప్పుకొచ్చాడు. హై కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా రాత్రంతా అల్లు అర్జున్ ని జైలు లో ఎందుకు ఉంచినట్టు?, అసలు ఏమి జరుగుతుంది అని మీడియా రిపోర్టర్స్ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించగా, ఆయన వాటికి చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

    అల్లు అర్జున్ రాత్రంతా ఒక సాధారణ ఖైదీ గానే జైలులో గడిపాడని, ఆయనకి ఒక నెంబర్ కూడా కేటాయించినట్టుగా ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. జైలు నుండి అల్లు అర్జున్ విడుదల అవ్వడానికి, జరగాల్సిన ఫార్మాలిటీస్ ని మొత్తం పూర్తి చేశామని, జైలు అధికారులకు బెయిల్ పేపర్స్ కూడా అందించామని, అన్ని సరిగ్గా ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ ని రాత్రి విడుదల చేయలేదని ఆయన ఆరోపించాడు. దీనిపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని , ఇందుకు బాధ్యులు అయిన ఎవరినీ వదిలిపెట్టమని, చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు పోరాడుతామని ఆయన మీడియా తో తెలిపారు. అల్లు అర్జున్ కి పిల్లనిచ్చిన మామయ్య చంద్ర శేఖర్ రెడ్డి కొంతకాలం క్రితమే బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. అయినప్పటికీ కూడా ఇలా జరగడం దురదృష్టకరమని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

    నిన్న ఒక ప్రముఖ నేషనల్ మీడియా కి ఇంటర్వ్యూ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం పై చాలా ఘాటుగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ చట్టం సామాన్యులకైనా, సెలెబ్రిటీలకైనా ఒకేలాగా ఉంటుందని, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులలో మాకు దగ్గర చుట్టాలు కూడా ఉన్నారని, అయినప్పటికీ తప్పు జరిగింది కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. అల్లు అర్జున్ అరెస్ట్ గురించే మాట్లాడుతున్నారు కానీ, ఒక నిండు ప్రాణం పోయింది, ఒక్క చిన్న పిల్లవాడు ఇంకా కోమాలోనే ఉన్నాడు, ఇదంతా అల్లు అర్జున్ కారణంగానే జరిగింది కదా?, ఆయన సైలెంట్ గా వచ్చి సినిమాని చూసుకొని తిరిగి వెళ్ళిపోయుంటే ఇంత సమస్య వచ్చేది కాదు, పోలీసులు ప్రోటోకాల్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ర్యాలీ చేస్తూ వెళ్ళాడు. దానివల్ల అక్కడ పరిస్థితులు అదుపు తప్పాయి అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.