Mahavatar Narsimha Movie Facts: ఈ ఏడాది చిన్న సినిమా గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమాల్లో ఒకటి ‘మహావతార్ నరసింహా'(Mahavatar Narasimha). యానిమేషన్ చిత్రం గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ సునామీ ని సృష్టిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఆడియన్స్ కి కచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడాలి అనిపించే కంటెంట్ ని వదిలితే, వాళ్ళు నెత్తిన పెట్టుకొని మరీ ఆరాధిస్తారు అనడానికి ఈ చిత్రం మరో ఉదాహరణగా నిల్చింది. కేవలం హిందీ వెర్షన్ నుండే ఈ సినిమా దాదాపుగా 151 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, 165 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వారం రెండు పెద్ద పాన్ ఇండియన్ సినిమాలు రావడం తో ఈ చిత్రానికి థియేటర్స్ బాగా తగ్గించారు.
ఆ రెండు సినిమాల్లో ఒక సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అవ్వడం తో అనేక చోట్ల నిన్నటి నుండి మళ్ళీ ఆ థియేటర్స్ ని రీ ప్లేస్ చేసింది ‘మహావతార్ నరసింహా’. సోమవారం నుండి ఇంకా ఎక్కువ థియేటర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ‘మహావతార్ నరసింహా’ చిత్రానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ చిత్రాన్ని ‘యానిమేషన్’ రూపం లో చెయ్యాలని మేకర్స్ అసలు అనుకోలేదట. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతోనే ఈ చిత్రాన్ని చెయ్యాలని అనుకున్నారట. అందులో భక్త ప్రహళ్లాద క్యారక్టర్ కోసం కన్నడ సూపర్ స్టార్స్ లో ఒకరైన దర్శన్ కుమారుడు వినీష్ ని ఎంపిక చేసుకున్నారట. హిరణ్యకశ్యప పాత్ర కోసం దర్శన్ ని ఎంచుకున్నారట. సుమారుగా 300 కోట్ల రూపాయిల బడ్జెట్ అనుకున్నారు.
Also Read: మొన్న ‘కింగ్ డమ్’… ఇప్పుడు ‘వార్ 2’ .. అజ్ఞాతంలో నాగవంశీ!
అప్పట్లో కూడా ‘భక్త ప్రహళ్లాద’ సినిమా కన్నడ లో తెరకెక్కింది. భక్త ప్రహళ్లాద గా పునీత్ రాజ్ కుమార్ నటిస్తే, హిరణ్య కశ్యప పాత్రలో ఆయన తండ్రి రాజ్ కుమార్ నటించాడు. ఆ రోజుల్లో కన్నడ సినీ పరిశ్రమలో ఈ చిత్రం ఒక ప్రభంజనం. మళ్ళీ అదే మ్యాజిక్ ని రీ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కానీ బడ్జెట్ వర్కౌట్ అవ్వకపోవడం తో ఈ సినిమా ఆగిపోయింది. దీంతో మేకర్స్ అక్కడితో ఆగిపోకుండా, యానిమేషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. పరిమితమైన బడ్జెట్ తో తీసిన ఈ యానిమేషన్ చిత్రం పై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు కానీ, విడుదలైన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఇన్ని అద్భుతాలను నెలకొల్పింది. మరో రెండు వారాల పాటు అద్భుతమైన థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకోగల సత్తా ఉన్న ఈ సినిమా, కచ్చితంగా 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరుతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.