https://oktelugu.com/

Tandel : ‘తండేల్’ లో ఆ ఒక్క సన్నివేశం 18 కోట్లు ఖర్చు చేసారా..? పూర్తి వివరాలు చూస్తే నోరెళ్లబెడుతారు!

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన 'తండేల్' చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమా గురించి అనేక విశేషాలను డైరెక్టర్ చందు మొండేటి ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు.

Written By: , Updated On : January 31, 2025 / 01:43 PM IST
Tandel

Tandel

Follow us on

Tandel : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తండేల్’ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమా గురించి అనేక విశేషాలను డైరెక్టర్ చందు మొండేటి ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కథని శ్రీకాకుళం జిల్లాలోని డి.మత్స్యలేశ్యం గ్రామం లో చోటు చేసుకున్న కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారట. స్క్రిప్ట్ ని సిద్ధం చేయడానికి చాలా రీ సెర్చ్ చేయాల్సి వచ్చిందని డైరెక్టర్ చందు మొండేటి చెప్పుకొచ్చాడు. నిర్మాత అల్లు అరవింద్ కి ఈ కథ మీద నమ్మకం ఉండడంతో, ఖర్చు కి ఎక్కడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడట. వరుస ఫ్లాప్స్ లో ఉన్న నాగ చైతన్య పై 80 కోట్ల రూపాయిల బడ్జెట్ ని పెట్టడమంటే చిన్న విషయం కాదు, ఎంతో డేర్ ఉండాలి.

అల్లు అరవింద్ లో మొదటి నుండి ఆ డేరింగ్ ఉండబట్టే, మన టాలీవుడ్ కి ‘మగధీర’ లాంటి సినిమాని అందించాడు. ఆరోజుల్లో ఆయన రిస్క్ చేసి ‘మగధీర’ తీసి ఉండకపోయుంటే, నేడు ‘బాహుబలి’ లాంటి సినిమాలు ఉండేవి కావని డైరెక్టర్ రాజమౌళి సైతం అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ ‘నా గత చిత్రం ‘కార్తికేయ 2 ‘ కి పని చేసిన అనుభవం, ఈ చిత్రానికి బాగా ఉపయోగపడింది. ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందు నేను ఒక పర్ఫెక్ట్ బడ్జెట్ ప్రణాళిక వేస్తాను. ఆ బడ్జెట్ కి మించి ఒక్క రూపాయి కూడా నిర్మాతతో ఖర్చు పెట్టించడం నాకు ఇష్టం లేదు. ఈ సినిమాకి కూడా అదే జరిగింది. హీరో, హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ లో మార్పులు తీసుకొని రావడానికి చాలా హోమ్ వర్క్ చేశాను’.

‘డి.మత్స్యలేశ్యం గ్రామానికి వెళ్లి అక్కడి జనాలను అప్పట్లో సముద్రం లో చోటు చేసుకున్న తుఫాన్లను ఎలా ఎదురుకున్నారు అనేది అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నాకు కలిగిన ఆ అనుభూతిని వెండితెర మీద ఆవిష్కరించి, జనాలకు కూడా అదే తరహా గూస్ బంప్స్ అనుభూతిని పంచాలని అనుకున్నాను. కేవలం ఆ ఒక్క సీక్వెన్స్ తీయడానికి 18 కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుందంటే నిర్మాత అల్లు అరవింద్ గారు మారు మాట్లాడకుండా నాకు కావాల్సిన బడ్జెట్ ని ఇచ్చారు. సినిమాలో ఈ సన్నివేశం పెద్ద హైలైట్ గా నిలవనుంది’ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ చందు మొండేటి. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ట్రైలర్ లో విజువల్స్ చూసిన తర్వాత కచ్చితంగా ఈ చిత్రం పెద్ద రేంజ్ కి వెళ్తుందని అందరికీ అనిపించింది. మరి ఆ రేంజ్ కి వెళ్తుందో లేదో తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.