Duvvada - Divvela madhuri
Duvvada Srinivasa Rao-Divvala Madhuri: కాంట్రవర్సీకి కేరాఫ్ గా నిలిచారు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి( Divvela Madhuri ) జంట. ఈ జంట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ ప్రముఖుల కంటే సెలబ్రిటీలు గా మారిపోయారు. సోషల్ మీడియాతో పాటు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా వీరి హవా నడిచింది. రెండు మూడు చానళ్లు వీరి ఎపిసోడ్ తోనే నడిపాయి అంటే మీరు ఏ స్థాయిలో సెలబ్రిటీలు గా మారారు అర్థమవుతోంది. అయితే వీరి ఫ్యూచర్ అనేది ఏంటన్నది తెలియడం లేదు గానీ.. ఫ్యూచర్ ప్లాన్స్ మాత్రం చాలానే ఉన్నాయి. తాజాగా ఈ జంట వస్త్ర వ్యాపారంలో అడుగుపెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ వ్యాపార సంస్థలను విస్తరించాలని భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాదులో వస్త్ర వ్యాపార రంగంలో అడుగుపెట్టి.. వాటిని తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాలన్నది వీరి ప్లాన్.
* గ్రానైట్ వ్యాపారిగా రాణించి
దువ్వాడ శ్రీనివాస్ కు( duvvada Srinivas ) వ్యాపార రంగంలో మంచి అనుభవం ఉంది. గతంలో ఆయన బ్లాక్ గ్రానైట్ వ్యాపారంలో ఉండేవారు. తన జీవిత భాగస్వామి దువ్వాడ వాణి తో కలిసి వ్యాపారాలు బాగానే చేసుకునేవారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో ఆ వ్యాపారాలు కాస్త మూతబడ్డాయి. దంపతులిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురితో సన్నిహితం పెంచుకున్నారు. చట్టపరమైన ఇబ్బందులు అధిగమించిన తర్వాత వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్లు తెలిపారు. అయితే అంతకంటే ముందే ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఈ జంట నిర్ణయం తీసుకుంది. అందుకే వస్త్ర వ్యాపారంలో అడుగు పెట్టాలని భావిస్తోంది. హైదరాబాద్ చందానగర్ లో.. కాంచీపురం వకుల సిల్క్ పేరిట షోరూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. తరువాత అదే పేరుతో విజయవాడ, విశాఖపట్నం వంటి మెట్రోపాలిటన్ సిటీల్లో షో రూమ్ లు ఏర్పాటు చేయాలని వారి టార్గెట్ గా తెలుస్తోంది.
* వ్యాపారంలో అనుభవం
అయితే దివ్వెల మాధురికి శారీ కలెక్షన్స్ తెలుసు. పైగా తన సోషల్ మీడియా( social media) రీల్స్ ద్వారా వ్యాపార విస్తరణ కూడా తెలుసు. సోషల్ మీడియా వేదికగా తమ ఉత్పత్తులను ప్రమోట్ కూడా చేసుకోగలరు. పైగా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులో మహిళలు అధికంగా ఉన్నారు. అందుకే కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి వ్యాపార రంగంలో అడుగుపెట్టింది ఈ జంట. పైగా వీరిద్దరూ సెలబ్రిటీలు గా మారిపోయారు. దానిని పెట్టుబడిగా మార్చుకొని వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో పేరు మోసిన ప్రాంతాల్లో ఉన్న వస్త్ర ఉత్పత్తులను పరిశీలించి.. విక్రయించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ పని మీద వెళ్తూ హౌరా బ్రిడ్జ్ వంటి చోట్ల రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
* మరో రెండున్నర ఏళ్ల పదవీకాలం
అటు దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ) రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వైసీపీ క్యాడర్ ఆయనకు దూరంగా ఉంటోంది. కానీ ఆయన మాత్రం అధినేత జగన్ వెంట ఉన్నారు. శ్రీనివాస్ కు మరో రెండున్నర ఏళ్ల పదవీకాలం ఉంది. అందుకే వ్యాపార రంగంలో నిలదుక్కుకోవాలని శ్రీనివాస్ భావిస్తున్నారు. అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనున్నారు. అయితే ఈ జంట భారీగా పెట్టుబడులు పెట్టి వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెడుతుండడం విశేషం. బహుశా తమ షాపులకు ప్రకటనల కంటే.. తామే ప్రకటన కర్తలుగా మారి వ్యాపారాలు చేసుకోగలమన్న ధీమా వారిలో కనిపిస్తోంది. మొత్తానికి అయితే ఈ జంట భవిష్యత్తు కార్యాచరణకు దిగడం నిజంగా హర్షించదగ్గ పరిణామం. మరి దీనిపై దువ్వాడ సతీమణి వాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.