Globetrotter Event: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu),రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి వారణాసి(Varanasi Movie) అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. నిన్న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగిన #Globetrotter ఈవెంట్ లో టైటిల్ రివీల్ తో పాటు, గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఈ గ్లింప్స్ పూర్తిగా AI తో చేసింది. కేవలం మా సినిమా ఎలా ఉండబోతుంది అని ఈ వీడియో తో చెప్పే ప్రయత్నం మాత్రమే చేసాడు రాజమౌళి. రాజమౌళి ఐడియా కి, ఆయనకీ ఉన్న విజన్ కి చూసే ఆడియన్స్ కి ఎప్పటి లాగానే మైండ్ బ్లాక్ అయ్యింది. ముఖ్యంగా ఆ వీడియో లో రాముడు, రావణుడిపై బాణం వేసే షాట్ ని చూపించిన విధానం, హనుమంతుడి తోకపై రథం స్వారీ చేస్తూ కనిపించడం, ఇలాంటి అద్భుతమైన విజువల్స్ కేవలం రాజమౌళి బుర్రలో మాత్రమే పుడతాయి. అందుకే ఆయన వరల్డ్ లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకడిగా పిలవబడుతాడు.
అంతా బాగానే ఉంది కానీ, మహేష్ బాబు లుక్ పై రాజమౌళి కాస్త శ్రద్ద తీసుకొని ఉండుంటే బాగుండేది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహేష్ కి ఆ మీసం, గెడ్డం అసలు సూట్ అవ్వలేదని, ఆయనలో ఒక తేజ సజ్జ, ఒక అక్కినేని అఖిల్ కనపడ్డారని సోషల్ మీడియా లో ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో మహేష్ బాబు ఎద్దు మీద స్వారీ చేస్తూ వచ్చే షాట్ ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారిపోయింది. గతం లో పవన్ కళ్యాణ్ ‘బంగారం’ సినిమాలోని ఇంటర్వెల్ సన్నివేశం గుర్తుందా?, అందులో ఆయన దున్నపోతు మీదకు ఎక్కి స్వారీ చేసే సన్నివేశంతో పోలుస్తూ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వెక్కిరిస్తున్నారు ఫ్యాన్స్.
సినిమాలో సందర్భానుసారం ఆ ఎద్దు షాట్ పెట్టి ఉండొచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ స్టేజి మీద కూడా అవసరమా?, రాజమౌళి పైత్యానికి హద్దులే లేవు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద హీరో సినిమా అన్న తర్వాత కచ్చితంగా తప్పులు వెతికే వాళ్ళు ఉంటారు. ప్రతీ స్టార్ హీరో సినిమా కంటెంట్ విడుదలైనప్పుడు ట్రోల్ల్స్ ఒక రేంజ్ లో కనిపిస్తూ ఉంటాయి. అది సర్వసాధారణం, కానీ ట్రోల్స్ చేయడం కోసం మాత్రమే ప్రత్యేకంగా కొన్ని సంఘటనలను క్రియేట్ చేయకూడదు కదా అనేది విమర్శకుల నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. ఏది ఏమైనా నిన్నటి ఈవెంట్ పై సోషల్ మీడియా లో డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ గ్లింప్స్ వీడియో కి మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి విజన్ కి నెటిజెన్స్ చేతులెత్తి దండం పెడుతున్నారు.
pic.twitter.com/QFKvHQC8hT https://t.co/SV1MKnfHlz
— Praveen #CSK (@Praveen_132) November 15, 2025