https://oktelugu.com/

Dhanush 3 movie : ధనుష్ ‘3’ చిత్రంలో శృతి హాసన్ తో ఉన్న ఈ అమ్మాయిని గమనించారా..? ఈమె కూడా ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్..ఎవరో గుర్తుపట్టండి!

ధనుష్ , శృతి హాసన్ కాంబినేషన్ లో వచ్చిన 'త్రీ' చిత్రం. ఈ సినిమా ద్వారానే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మన సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ కి దొరికాడు. ముఖ్యంగా ధనుష్ తో ఆయన పాడించిన 'వై థిస్ కొలెవరి' సాంగ్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయ్యింది. ఈ చిత్రం ద్వారా ప్రస్తుతం తమిళనాట స్టార్ హీరోగా కొనసాగుతున్న శివ కార్తికేయన్ కూడా పరిచయమయ్యాడు. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 20, 2024 / 05:23 PM IST

    Shruti Haasan Fiend Character

    Follow us on

     

    Dhanush 3 movie :  కొన్ని చిత్రాలు కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యినప్పటికీ, కాలం గడిచే కొద్దీ వాటికి దక్కాల్సిన గౌరవం దక్కుతుంటాయి. అప్పటి ఆడియన్స్ మైండ్ సెట్ కి తగ్గట్టుగా ఈ సినిమాలు లేకపోవడం వల్లే ఫ్లాప్స్ అయ్యాయి కానీ, సినిమాలో కంటెంట్ ఉంది,దమ్ము ఉంది అని నమ్మే చిత్రాలు కొన్ని ఉన్నాయి. అలాంటి చిత్రాలలో ఒకటి ధనుష్ , శృతి హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ‘త్రీ’ చిత్రం. ఈ సినిమా ద్వారానే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మన సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ కి దొరికాడు. ముఖ్యంగా ధనుష్ తో ఆయన పాడించిన ‘వై థిస్ కొలెవరి’ సాంగ్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయ్యింది. ఈ చిత్రం ద్వారా ప్రస్తుతం తమిళనాట స్టార్ హీరోగా కొనసాగుతున్న శివ కార్తికేయన్ కూడా పరిచయమయ్యాడు. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

    ఈ చిత్రానికి ధనుష్ భార్య, రజినీకాంత్ కూతురు దర్శకత్వం వహించింది. అప్పట్లో ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది కానీ, ఈ తరం ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే ఈ చిత్రాన్ని ఇటీవల కాలం లో రెండు సార్లు రీ రిలీజ్ చేస్తే, రెండు సార్లు కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమా రీ రిలీజ్ కి వచ్చిన వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు కూడా షాక్ కి గురయ్యారు. ఒక తమిళ డబ్బింగ్ హీరో ఫ్లాప్ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రీ రిలీజ్ రావడం ఏమిటి?, అదెలా సాధ్యం అంటూ ఆరాలు తీశారు. యూత్ ఆడియన్స్ కి నచ్చితే ఏ సినిమా అయినా ఇదే రేంజ్ లో ఆడుతుందని తెలుసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం ధనుష్ స్నేహితుడిగా శివ కార్తికేయన్ నటిస్తే, శృతి హాసన్ చెల్లిగా గాబ్రియెల్లా నటాలీ చార్ల్టన్ నటించింది.

    ఈ సినిమా సమయంలో ఆ అమ్మాయిది చాలా చిన్న వయస్సు. బాల నటిగా ఈ చిత్రం తో పాటు, పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈమె. అయితే ఇప్పుడు పెద్దయ్యాక ఈమె హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని అందంతో మెరుస్తూ కుర్రకారుల మతులను పోగొడుతుంది. ఇంస్టాగ్రామ్ లో ఈమె ఇప్పటికే ఒక టాప్ మోస్ట్ సెలబ్రిటీ గా కొనసాగుతుంది. బాలీవుడ్ లో ఈమె హీరోయిన్ గా మొదటి చిత్రం కూడా ఈమధ్యనే ప్రారంభం అయ్యింది. అయితే ఇది ఆమెకి పెద్దయ్యాక మొదటి సినిమా అయ్యుండొచ్చు కానీ, 3 సినిమా విడుదలైన మూడేళ్లకే ఆమె ‘అప్పా’ అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత స్టడీస్ మీద ఏకాగ్రత పెట్టిన ఈ క్యూట్ బ్యూటీ ఇప్పుడు మళ్ళీ మన ముందుకు రాబోతుంది. హీరోయిన్ గా ఆమె ఇప్పటి పోటీ వాతావరణం ని తట్టుకొని ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.