https://oktelugu.com/

Game Changer Trailer: ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ లో ఈ ఇద్దరు పిల్లల్ని గమనించారా..? వాళ్ళు ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు..శంకర్ ఊర మాస్ టేకింగ్!

ఈ సినిమా లో అంజలి క్యారక్టర్ గురించి డైరెక్టర్ శంకర్ చాలా గొప్పగా చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె క్యారక్టర్ ఇచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ రోల్ గా నిలిచిపోతుందని కూడా చెప్పుకొచ్చారు. అంజలి కూడా ఇదే విషయాన్నీ పలుమార్లు చెప్పింది.

Written By:
  • Vicky
  • , Updated On : January 3, 2025 / 03:54 PM IST

    Game Changer Trailer(10)

    Follow us on

    Game Changer Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ థియేట్రికల్ ట్రైలర్ నిన్న విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకునే సంగతి తెలిసిందే. అభిమానుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం సహజం, కానీ అన్ని సినిమాలకు సమాన భావంతో రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఈ ట్రైలర్ ని అమితంగా ఇష్టపడ్డారు. వింటేజ్ శంకర్ రేంజ్ సినిమా అంటే ఇదే, మళ్లీ ఆయనకు పూర్వ వైభవం వచ్చేసింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన ఈ సినిమా లో అంజలి క్యారక్టర్ గురించి డైరెక్టర్ శంకర్ చాలా గొప్పగా చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె క్యారక్టర్ ఇచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ రోల్ గా నిలిచిపోతుందని కూడా చెప్పుకొచ్చారు. అంజలి కూడా ఇదే విషయాన్నీ పలుమార్లు చెప్పింది.

    ఇంతకీ అంతటి సర్ప్రైజ్ ఇచ్చేంత ఆమె క్యారక్టర్ లో ఏమి ఉంటుంది? అని అభిమానులు ట్రైలర్ లోని కొన్ని షాట్స్ ని బట్టి అంచనా వేసే ప్రయత్నం చేసారు. ట్రైలర్ లోని 1 నిమిషం 53 వ సెకండ్ దగ్గర గమనిస్తే అప్పన్న(రామ్ చరణ్ ) క్యారక్టర్ కి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇక ఆ తర్వాతి షాట్ లో అంజలి ముఖానికి అలాగే, ఒక కొడుకు ముఖానికి బ్లర్ చేసి ఉంటుంది. అంటే ఆమెకి ఉన్నటువంటి ఇద్దరు కొడుకులతో ఒకరు విలన్ క్యారక్టరా? (ఎస్ జె సూర్య), లేదా ట్రైలర్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన రామ్ చరణ్, IAS ఆఫీసర్ గా కనిపించిన రామ్ చరణ్ వేరు వేరునా? అనేది తెలియాల్సి ఉంది. ఈ షాట్స్ అన్నిటిని చూసి మరో అంచనా కి కూడా వస్తున్నారు అభిమానులు.

    అదేమిటంటే ఈ చిత్రం లో అంజలి విలన్ క్యారక్టర్ చేసిందని, ఈ ట్విస్ట్ క్లైమాక్స్ లో తెలుస్తుందని, ఆమె శ్రీకాంత్ తో ఫ్లాష్ బ్యాక్ లో రహస్య సంబంధం పెట్టుకొని ఎస్ జె సూర్య కి జన్మనిచ్చిందని, వాడిని సీఎం పదవి నుండి తప్పించాలని చూసిన రెండవ కొడుకు రామ్ చరణ్ ని చంపేయాలని ప్లాన్ చేసి ఉండొచ్చని, ఇలా పలు రకాలుగా ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్. ఇవంతా కేవలం వాళ్ళ ఊహలు మాత్రమే, కానీ సినిమాలో ఈ ట్విస్ట్ నిజంగానే ‘అన్ ప్రెడిక్టబుల్’ గా ఉండబోతుందని సమాచారం. మరి డైరెక్టర్ శంకర్ అంత ప్రత్యేకించి చెప్పిన అంజలి క్యారక్టర్ ఇచ్చే ట్విస్ట్ ఏమిటి?, ఆడియన్స్ ని ఆ క్యారక్టర్ నిజం గా అంత షాక్ కి గురి చేస్తుందా అనేది తెలియాలంటే మరో వారం రోజులు ఎదురు చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం రాజమండ్రి లో జరగనుంది. ఈ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.