https://oktelugu.com/

Pawan Kalyan Fans: ఆ పని చేయడంతో మరోసారి అల్లు ఫ్యామిలీ మీద కోపంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్…

Pawan Kalyan Fans: ఇతర హీరోల అభిమానులు కూడా అతని సినిమాలను చూస్తూ అతన్ని ఇష్టపడుతూ ఉంటారు. దానికి కారణం ఆయన వ్యక్తిత్వం అనే చెప్పాలి. ఆయన దగ్గర డబ్బులు ఉన్న లేకపోయిన అప్పు చేసి మరీ ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు. అందువల్లే ఆయన చాలా ఉత్తమమైన స్థాయిలో నిలిచాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 10, 2024 / 01:05 PM IST

    Pawan Kalyan fans are once again angry with Allu family after doing that

    Follow us on

    Pawan Kalyan Fans: సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు మెగా ఫ్యామిలీ లోనే కాదు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు అందరూ దిగదుడుపనే చెప్పాలి.ఇక ఆయన సినిమాల ద్వారా గాని వ్యక్తిత్వం ద్వారా గాని ప్రతి ఒక్కరూ అతనికి అభిమానులుగా మారిపోయారు.

    ఇక ఇతర హీరోల అభిమానులు కూడా అతని సినిమాలను చూస్తూ అతన్ని ఇష్టపడుతూ ఉంటారు. దానికి కారణం ఆయన వ్యక్తిత్వం అనే చెప్పాలి. ఆయన దగ్గర డబ్బులు ఉన్న లేకపోయిన అప్పు చేసి మరీ ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు. అందువల్లే ఆయన చాలా ఉత్తమమైన స్థాయిలో నిలిచాడు. ఇక ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు కొనసాగిస్తునాడు. ఇక ఆయన చేసే కార్యకలాపాలను ఉద్దేశిస్తూ బద్రీనాథ్ సినిమాలోని ‘ఓంకారేశ్వరి ‘ అనే సాంగ్ ని పవన్ కళ్యాణ్ చేసే పనులకు కలుపుతూ ఎడిట్ చేశారు. ఇక ఇది ఎవరు చేశారో తెలియదు గాని ఇది మాత్రం పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది అంటూ పలురకాల కామెంట్లు వస్తున్నాయి. అలాగే వీడియో కూడా వైరల్ అవుతుంది.

    ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు కాంపౌండ్ లోని అఫీషియల్ పేజీ నుంచి బద్రీనాథ్ సినిమాలోని ఓంకారేశ్వరి సాంగ్ మీద అల్లు అర్జున్ డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇక దీన్ని చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రమైన కోపానికి గురి అవుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాడుకుంటున్న సాంగ్ ఒరిజినల్ మాది అనే ఉద్దేశంతోనే అల్లు ఫ్యామిలీ ఇలాంటి ఒక వీడియోని పోస్ట్ చేయించింది అంటూ వాళ్లు అల్లు ఫ్యామిలీ మీద విపరీతమైన కోపంతో ఉన్నారు.

    ఇక ఇదిలా ఉంటే అల్లు ఫ్యామిలీ అఫీషియల్ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా లో ఏపీ ఎలక్షన్స్ కి రెండు రోజుల ముందు యాత్ర 2 సినిమా ట్రైలర్ ను హైలెట్ చేస్తూ ఈ సినిమాని అందరూ చూడండి అంటూ పబ్లిసిటీ చేశారు. దాని అర్థం ఏంటి అంటే అందరూ ఈ సినిమాను చూసి వైసీపీ పార్టీ కే ఓటేయమని అర్థం వచ్చేలా చేశారు. ఇక మొత్తానికైతే ఇప్పుడు అల్లు ఫ్యామిలీ మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికి కూడా చాలా కోపంతో ఉన్నారు…