Homeఎంటర్టైన్మెంట్Amma Rajasekhar - Prabhas: అమ్మా రాజశేఖర్ - ప్రభాస్ కాంబినేషన్ లో మిస్ అయినా...

Amma Rajasekhar – Prabhas: అమ్మా రాజశేఖర్ – ప్రభాస్ కాంబినేషన్ లో మిస్ అయినా సినిమా ఏమిటో తెలుసా ?

Amma Rajasekhar – Prabhas: మన సౌత్ ఇండియా లో డాన్స్ మాస్టర్స్ గా వచ్చి ఆ తర్వాత డైరెక్టర్స్ గా ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు..ప్రభుదేవా మరియు లారెన్స్ వంటి వారు ఆ స్థాయి నుండి వచ్చిన వారే..వీళ్ళు డైరెక్టర్స్ గా కూడా ఎన్నో కమర్షియల్ సక్సెస్ లను చూసారు..వీరిని చూసి ఎంతో మంది డాన్స్ మాస్టర్స్ డైరెక్టర్స్ అవతారం ఎత్తి చేతులు కాల్చుకున్నారు..అలాంటి డాన్స్ మాస్టర్స్ లో ఒకరే అమ్మా రాజశేఖర్..డాన్స్ మాస్టర్ గా ఈయన సౌత్ ఇండియా లో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు పని చేసాడు..మంచి కెరీర్ డెవలప్ అయ్యింది..అలాంటి సమయం లో ఒక్క అద్భుతమైన స్టోరీ సిద్ధం చేసుకొని గోపీచంద్ తో రణం సినిమా తీసాడు..ఈ సినిమా అప్పట్లో మాములు హిట్ కాదు..గోపీచంద్ ని మాస్ గా నిలబెట్టింది ఈ సినిమానే..ఆరోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా 20 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది..అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత డైరెక్టర్ కి పెద్ద హీరోల నుండి కాల్స్ రావడం..మాతో సినిమాలు చెయ్యమని అడ్వాన్స్ ఇవ్వడం సర్వసాధారణం..అలాగే అమ్మ రాజా శేఖర్ కి కూడా అవకాశాలు వెల్లువ లాగ కురిశాయి.

Amma Rajasekhar - Prabhas
Amma Rajasekhar – Prabhas

మెగాస్టార్ చిరంజీవి వంటి వారే తనతో సినిమా చెయ్యాలని అమ్మ రాజశేఖర్ కి అడ్వాన్స్ ఇచ్చాడు..చిరంజీవి గారితో పాటుగా ఎంతో మంది స్టార్ హీరోలు అప్పట్లో అమ్మ రాజశేఖర్ కి అడ్వాన్సులు ఇచ్చారు..వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకడు..ఇటీవలే ప్రభాస్ తో సినిమా ఛాన్స్ ఎలా మిస్ అయ్యాడో అమ్మ రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూ లో చెప్తూ ‘ప్రభాస్ కి ఒక రోజు నేను కథ చెప్పాల్సి ఉంది..ఆ సమయం లో నాకు వేరే పని ఉండడం వల్ల ప్రభాస్ గారిని కలవలేకపొయ్యాను..రెండు రోజుల తర్వాత ప్రభాస్ గారిని కలవడానికి వెళ్తే సార్ బిజీ గా ఉన్నారు ఈరోజు కలవడం కుదరదు అన్నారు.

Also Read: Droupadi Murmu: కొత్త రాష్ట్రపతికి పుట్టింటి కానుకగా ఏమి ఇచ్చారంటే

Amma Rajasekhar - Prabhas
Amma Rajasekhar

ఆ సమయం లో నితిన్ నుండి నాకు ఫోన్ వచ్చింది..ఒక పాట కి కొరియోగ్రఫీ చెయ్యాలన్నాడు..నేను ఓకే చెప్పి చేశాను..ఆలా బిజీ అవ్వడం వల్ల ప్రభాస్ తో సినిమా మిస్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు అమ్మా రాజశేఖర్..ఇంతకీ ఆయన ప్రభాస్ తో చేద్దాం అనుకున్న సినిమా ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..మాస్ మహారాజ రవితేజ తో అమ్మ రాజా శేఖర్ చేసిన ‘ఖతర్నాక్’ అనే సినిమా మన అందరికి గుర్తు ఉండే ఉంటుంది..ఈ స్టోరీ తోనే కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రభాస్ తో చెయ్యాలనుకున్నాడట..విక్రమార్కుడు వంటి భారీ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా ఆడింది.

Also Read:Vishnu Vishal Nude Pic: రణ్ వీర్ తర్వాత నగ్నంగా మరో హీరో.. ఏంటీ బహిరంగ ‘బరివాత’ యవ్వారం?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version