Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ మొదలైపోయింది. గొడవలు కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఈ షో మొదలయ్యి మూడు రోజులు కాగా.. అప్పుడే హౌస్ లో ఆటలు అడుకుంటూ గొడవలు పడుకుంటూ ముందుకు సాగిపోతున్నారు కంటెస్టెంట్లు. ఈ షో లో ప్రస్తుతానికి 14 మంది కంటెస్టెంట్లు ఉండగా, అందులో చాలా తెలివైన అమ్మాయిగా కనిపిస్తున్న శుభశ్రీ గురించి ప్రస్తుతం ఒక వాత్ర తెగ వైరల్ అవుతుంది.
అదేమిటి అంటే ఈ అమ్మడి ఏకంగా పవన్ కళ్యాణ్ రాబోయే సినిమా ఒజీలో నటిస్తోందట. కాబట్టి ఈ అమ్మడికి పవన్ అభిమానుల నుంచి గెట్టి సపోర్ట్ ఉంటుందేమో అని అనుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లేముందు తన గురించి మీడియాతో నాలుగు ముక్కలు పంచుకుంది. ఇక తాను పంచుకున్న విషయాల్లో అందరి దృష్టిని ఆకట్టుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమాలో నటించింది అన్న విషయమే.
‘‘నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం. ఆయన అప్ కమింగ్ మూవీ OGలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఆ సినిమా చాలా స్టైలిష్‌గా ఉంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరిచిపోలేను. పవర్ స్టార్ అంటే.. పవర్ జనరేట్ చేస్తున్నట్టే ఉంది. ఊరికే పవర్ స్టార్‌లు అయిపోరు.. ఆయన యాటిట్యూడ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన కళ్లల్లోనే పవర్ ఉంటుంది. వాకింగ్ స్టైల్ అలా చూడాలనిపిస్తుంది” అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది.
ఇక తన పర్సనల్ విషయాలను పంచుకుంటూ..”బిజినెస్ రంగంలో కూడా అడుగుపెట్టాలని ఉంది. నాకు ఫుడ్ అంటే ఇష్టం. ఆల్కహాల్ కూడా దొరికేట్టుగా.. హైదరాబాద్‌లో పబ్ పెడుతున్నా. నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం.. చికెన్ బాగా తింటా. వండటం కూడా వచ్చు. కట్టెలపొయ్యిపై కూడా వండుతాను. బిగ్ బాస్ హౌస్‌లో కట్టెల పొయ్యి ఉండదు కాబట్టి.. నా చేతి చికెన్ కర్రీ రుచి చూపిస్తాను” అని తన పైన తనకున్న నమ్మకాన్ని తెలియజేసింది శుభ శ్రీ.
ఈ అమ్మడు గురించి మరో విశేషం ఏమంటే తాను లాయర్ కూడా. ఇక లా లా వృత్తిలో ఉన్నప్పుడే 2022లో రుద్రవీణ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ‘కథ వెనుక కథ’, ‘సందేహం’ లాంటి చిన్న సినిమాల్లో నటించింది. అయితే సినిమాల వల్ల శుభ శ్రీ కి పెద్ద గుర్తింపు రాలేదు. మరి బిగ్ బాస్ ద్వారా వస్తుందేమో వేచి చూడాలి.