Maniratnam-RGV: సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు గాని వాళ్ళు సాధించిన సక్సెస్ లు గాని వాళ్ళని చాలా ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాయి. అలాంటి వాళ్లలో తెలుగులో రామ్ గోపాల్ వర్మ ఒకరైతే, తమిళం లో మణిరత్నం మరొకరు… ఒకప్పుడు ఇద్దరు కూడా లెజెండరీ డైరెక్టర్లుగా గుర్తింపు పొందారు. ఇక ఆర్జీవీ శివ, రంగీలా, సర్కార్, కంపెనీ, క్షణక్షణం లాంటి సినిమాలు చేస్తే, మణిరత్నం బొంబాయి, దళపతి, దిల్ సే, సఖి లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.
ఇక వీళ్లిద్దరూ లెజెండరీ డైరెక్టర్లు గా ఉన్నప్పుడే వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా అయితే వచ్చింది. ప్రశాంత్, ఆనంద్ లు హీరోలుగా చేసిన దొంగ దొంగ సినిమాకి వీళ్ళిద్దరూ కథ రాసుకొని దర్శకత్వం చేయడం విశేషం…ఇక ఇండస్ట్రీ లో ఉన్న ఇద్దరు లెజెండరీ డైరెక్టర్లు కలిసి సినిమా చేస్తే చూడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. నిజానికి వీళ్ళ మధ్య ఉన్న మంచి ఫ్రెండ్షిప్ వల్లే ఈ సినిమాని వీళ్ళు చేశారు. అలాగే దాన్ని సక్సెస్ ఫుల్ గా కూడా నిలిపారు. మరి దొంగ దొంగ సినిమాతో ఇద్దరు దర్శకులు ఒక సూపర్ సక్సెస్ అయితే అందుకున్నారు. ఇక ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరిలో ఒక ఈగో అయితే ఉంటుంది. మనిద్దరం కలిసి సినిమా చేయడం ఎందుకు అనే ఒక పొరపాటు అభిప్రాయంతో ఉంటారు. అందువల్ల ఎవరికి వాళ్లే గొప్ప అనే ఒక కాన్సెప్ట్ లో అయితే ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో అప్పటి లెజెండరీ దర్శకులైన వీళ్ళు ఇద్దరు కలిసి సినిమా చేయడం అనేది నిజంగా చాలా మంది దర్శకులకు ఆదర్శం గా నిలిచింది.
ఇక ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అడపాదడప ఏవో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే మణిరత్నం మాత్రం పొన్నియన్ సెల్వన్ లాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు కమల్ హాసన్ తో తుగ్ లైఫ్ అనే సినిమాని కూడా చేస్తూ మరోసారి తన స్టామినాయేంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పోన్నియన్ సెల్వన్ సినిమా తమిళంలో మంచి విజయాన్ని సాధించినప్పటికీ తెలుగులో మాత్రం ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. మరి ఇలాంటి సినిమాతో మణిరత్నం తెలుగులో మంచి గుర్తింపు పొందలేకపోయాడు.
కాబట్టి కమల్ హాసన్ తో చేస్తున్న తుగ్ లైఫ్ సినిమాతో తనకు తెలుగులో ఎలాంటి గుర్తింపు అయితే ఉందో ఆ గుర్తింపును మరోసారి కాపాడుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం ఇద్దరూ కూడా ఇప్పుడున్న దర్శకులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తిలేదు…ఇక రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో నాగార్జునను స్టార్ హీరోగా చేశారు.
అలాగే మణిరత్నం అరవింద్ స్వామి, మాధవన్ లాంటి హీరోలను రోజా, ముంబాయి, సఖి లాంటి సినిమాలతో స్టార్ హీరోలుగా మార్చడమే కాకుండా వాళ్లకు ఇండస్ట్రీలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా ప్రయత్నం అయితే చేశాడు…ఇక ఇండస్ట్రీలో ఇప్పటికే వీళ్ళ శిష్యులు చాలామంది దర్శకులుగా మారి సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారనే విషయం మనకు తెలిసిందే…ఇక వీళ్ళు మరోసారి కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు…