https://oktelugu.com/

Lionel Messi : ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ కి గాయం.. కన్నీరు పెట్టిన అభిమాన గణం.. వీడియో వైరల్..

అర్జెంటీనా విజయాన్ని కంటే ముందు మైదానంలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొంతమంది అభిమానులు అతిగా మద్యం తాగి వచ్చి టికెట్ లేకుండా మైదానంలోకి ప్రవేశించారు. ఆటకు చాలాసేపు అంతరాయం కలిగించారు. వికృత చేష్టలకు పాల్పడటంతో వారిని నిలువరించడం భద్రత సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. అభిమానుల అతి చేష్టల వల్ల దాదాపు మ్యాచ్ గంటన్నర సేపు ఆలస్యంగా మొదలైంది.

Written By: NARESH, Updated On : July 15, 2024 1:42 pm
Follow us on

Lionel Messi : సమకాలీన ఫుట్ బాల్ చరిత్రలో మెస్సికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పీలే, మారడోనా, తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించిన ఆటగాడిగా మెస్సి కొనసాగుతున్నా. 2022 ఖతార్ వేదికగా జరిగిన సాకర్ ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ పై గెలిపించి అర్జెంటీనాను విజేతగా నిలిపాడు. 2021 కోపా అమెరికా కప్ లో సైతం అర్జెంటీనాను కప్ అందించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. 2024 కోపా అమెరికా కప్ లోనూ అర్జెంటీనా విజేతగా ఆవిర్భవించింది. ఫ్లోరిడా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో కొలంబియా పై 1-0 తేడాతో ఘనవిజయం సాధించింది. అర్జెంటి నాకు ఇది 16వ కోపా అమెరికా కప్ టైటిల్. 2021లో కోపా.. 2022లో సాకర్ ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత.. అర్జెంటీ నాకు ఇది మూడవ అంతర్జాతీయ టైటిల్.

మ్యాచ్ కు ముందు ఏం జరిగాయంటే..

అర్జెంటీనా విజయాన్ని కంటే ముందు మైదానంలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొంతమంది అభిమానులు అతిగా మద్యం తాగి వచ్చి టికెట్ లేకుండా మైదానంలోకి ప్రవేశించారు. ఆటకు చాలాసేపు అంతరాయం కలిగించారు. వికృత చేష్టలకు పాల్పడటంతో వారిని నిలువరించడం భద్రత సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. అభిమానుల అతి చేష్టల వల్ల దాదాపు మ్యాచ్ గంటన్నర సేపు ఆలస్యంగా మొదలైంది. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కొద్దిసేపటికే మెస్సి అసౌకర్యంగా కనిపించాడు.. చీలమండ గాయంతో విలవిలాడిపోయాడు. అయినప్పటికీ అలాగే ఆట కొనసాగించాడు. ఇక మ్యాచ్ 64 నిమిషంలో మెస్సి మైదానంలో కుప్పకూలిపోయాడు. దీంతో ఫిజియోథెరపిస్టులు ఆగమేఘాల మీద మైదానంలోకి వచ్చారు. అతడికి చాలా సేపు చికిత్స అందించారు.. గాయం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. మెస్సి గాయపడటంతో మైదానంలో ఉన్న ప్రేక్షకులు కన్నీటి పర్యంతమయ్యారు.. we are with you Messi అంటూ ఫ్ల కార్డులు ప్రదర్శించారు.

దుఃఖంతో మైదానాన్ని వీడాడు

మైదానం నుంచి మెస్సి నిష్క్రమించినప్పుడు కొలంబియా – అర్జెంటీనా జట్ల స్కోర్లు 0-0 తో ఉన్నాయి. నిర్ణిత సమయం వరకు రెండు జట్లు కూడా గోల్ సాధించలేకపోవడంతో.. నిర్వాహకులు అదనపు సమయానికి కేటాయించారు. ఈ క్రమంలో మ్యాచ్ 112 నిమిషంలో మార్టినేజ్ గోల్ సాధించడంతో అర్జెంటినా విజయం సాధించింది. ఫలితంగా రికార్డు స్థాయిలో 16వసారి కోపా కప్ విజేతగా నిలిచింది. అర్జెంటీనా విజయ సాధించడంతో డగ్ ఔట్ లో ఉన్న మెస్సి కన్నీటి పర్యంతమయ్యాడు. వాస్తవానికి గాయం వల్ల మైదానాన్ని వీడినప్పటి నుంచి మెస్సి ఏడుస్తూనే ఉన్నాడు. చీలమండ గాయమైన కాలి షూ విప్పి..డగ్ ఔట్ లో ఉన్న ఒక ఇనుప స్తంభాన్ని పట్టుకుని అలాగే నిలుచుండిపోయాడు. ఆ నొప్పితో అలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. జట్టు ఆటగాళ్లు ఆడుతున్నతసేపు ఉద్వేగానికి గురయ్యాడు. ఆ ఒత్తిడి అతడి కళ్ళల్లో కనిపించింది.

గోల్ చేయడంతో మెస్సి ఆనందతాండవం

మెస్సీ ని చూసి అభిమానులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. చివరికి అదనపు సమయంలో మార్టినేజ్ గోల్ చేయడంతో మెస్సి లో ఆనందం తాండవం చేసింది. ఆ సందర్భాన్ని డగ్ ఔట్ లో ఉన్న ఇతర ఆటగాళ్లతో పంచుకున్నాడు. సంతోషంతో కేరింతలు కొట్టాడు. ఆ కాలి నొప్పిని అలాగే భరించుకుంటూ వచ్చి మైదానంలోకి ప్రవేశించాడు. తన సుదీర్ఘ కెరియర్లో చివరి కోపా అమెరికా కప్ ఆడుతున్న మెస్సిని చూసి సహచర ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. గెలిచామంటూ ఉద్వేగంగా అతడిని హత్తుకున్నారు. అనంతరం కాలి నొప్పితో బాధపడుతూనే మెస్సి ట్రోఫీ అందుకున్నాడు.. 2022లో సాకర్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మెస్సీ విభిన్నమైన నడకతో కప్ అందుకున్నాడు.. అది సోషల్ మీడియాను షేక్ చేసింది.