https://oktelugu.com/

Renault Duster 7 Seater : ఆ మూడు కార్లకు భారీ షాక్ ఇవ్వనున్న డస్టర్.. త్వరలో మార్కెట్లోకి అద్భుతమైన కారు.. ఫీచర్స్ లీక్..

Renault కంపెనీ గురించి చర్చకు వచ్చినప్పుడు డస్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. 2010లో డస్టర్ మార్కెట్లోకి వచ్చింది. ముందుగా దీనిని లాటిన్ అమెరికా, రష్యా మార్కెట్లో విక్రయించారు. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. 2012 నుంచి భారత్ లో విక్రయాలు మొదలు పెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల 2022 లో దీని ఉత్పత్తిని నిలిపివేశారు

Written By:
  • NARESH
  • , Updated On : July 15, 2024 / 01:25 PM IST
    Follow us on

    Renault Duster 7 Seater : ఆటోమోబైల్ మార్కెట్లో కొన్ని కార్లు ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి. కానీ ఒక్కోసారి వీటికి చిన్న కంపెనీలు గట్టి పోటీ ఇచ్చే కార్లను మార్కెట్లోకి తీసుకొస్తాయి. ముఖ్యంగా 7 సీటర్ కార్లలు మూడు కంపెనీలు కార్లు పోటీ పడుతూ ఉంటాయి. వీటిలో టాటా, హ్యుందాయ్, ఎంజీ హెక్టర్ లు ఉన్నాయి. టాటా నుంచి ఇప్పటికే 7 సీటర్ కార్లు చాలా వచ్చాయి. వీటిలో సఫారీ ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. హ్యుందాయ్ నుంచి అల్కాజార్ బెస్ట్ 7 సీటర్ కారుగా ప్రఖ్యాతి పొందింది. ఇక ఎంజీ మోటార్స్ నుంచి హెక్డార్ మార్కెట్లోకి వచ్చింది. 7 సీటర్ వేరియంట్ లో ఈ మూడు కార్లు పోటీ పడుతూ ఉంటాయి. అయితే వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు డస్టర్ రెడీ అవుతోంది. త్వరలో 7 సీటర్ కారును మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

    Renault కంపెనీ గురించి చర్చకు వచ్చినప్పుడు డస్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. 2010లో డస్టర్ మార్కెట్లోకి వచ్చింది. ముందుగా దీనిని లాటిన్ అమెరికా, రష్యా మార్కెట్లో విక్రయించారు. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. 2012 నుంచి భారత్ లో విక్రయాలు మొదలు పెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల 2022 లో దీని ఉత్పత్తిని నిలిపివేశారు. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగిన ఇది 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. 2,673 వీల్ బేస్ తో నిర్మీతమైంది. ఆ తరువాత దీనిని 2013లో డస్టర్ ఫేస్ లిప్ట్ ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇందులో కొత్త క్రోమ్డ్ గ్రిల్ తో పాటు హెడ్ లైట్లు రీ డిజైన్ చేశారు.

    దాదాపు 15 దేశాల్లో డస్టర్ బెస్ట్ కారుగా ప్రఖ్యాతి పొందింది. భారత్ లో ప్రముఖ ఆటోమోటివ్ మ్యాగజైన్ల జ్యూరీ నుంచి రెనాల్ట్ డస్టర్ ‘2013 ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సొంతం చేసుకుంది. పాత డస్టర్ సుమారు 80 వేల వార్షిక ప్రమాణాలతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇది ప్రారంభమైన 2.5 సంవత్సరాల్లో 2 లక్షల అమ్మకాలకు చేరుకుంది. భారత్ లో డస్టర్ అత్యధికంగా 2013లో 51,411 యూనిట్లను విక్రయించారు. ఆ తరువాత అమ్మకాలు తగ్గుతూ వచ్చి 2020లో 3,685 యూనిట్లు మాత్రమే విక్రయించారు.

    ఇప్పుడు డస్టర్ మూడవ తరం మార్కెట్లోకి రాబోతుంది. ఇది 7 సీటర్ ను కలిగి ఉండడం విశేషం. ఎందుకంటే పాత డస్టర్ 5 సీట్లకే పరిమితం అయింది. అయితే ఇది 2025లో మార్కట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందే దీని గురించిన వివరాలు బయటకు వచ్చాయి. కొత్త డస్టర్ ను స్పెయిన్ లో పరీక్షిస్తున్నారు. ఇది 4.6 మీటర్ల పొడవు ఉండనుంది. వీల్ బేస్ ఎక్కువ పరిమాణం కలిగి ఉండే అవకాశం ఉంది. ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ను కలిగి క్యాబిన్ స్పేస్, పెద్ద డోర్లు ఉండనున్నాయి.

    7 సీటర్ డస్టర్ ఇంజిన్ విషయానికొస్తే ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.6 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగి ఉంది. బిగ్ స్టర్ ఎస్ యూవీ బహుళ డ్రైవ్ మోడ్ తో పాటు ఫోర్ వర్సెస్ 2 సిస్టమ్ ను కలిగి ఉంటుంది. 2025 ఏడాది చివరి నాటికి ఇది మార్కెట్లోకి రానుంది. అయితే ముందుగా 5 సీటర్ డస్టర్ ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఆ తరువాత 7 సీటర్ మోడల్ ను అందుబాటులోకి తీసుకొస్తారు. దీనిని రూ.10 లక్షల నుంచి విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.