Dil Raju about Dil Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో నితిన్ (Nithin)… ఆయన చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించి అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఆయన ఫ్లాపుల్లో ఉన్నప్పటికి మరోసారి మంచి కంబ్యాక్ ఇవ్వడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. అయితే నితిన్ తేజ డైరెక్షన్ లో చేసిన ‘జయం’ (Jayam) సినిమాతో హీరోగా మారిన విషయం మనకు తెలిసిందే… జయం సినిమా రిలీజ్ అవ్వకముందే డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు ఆది సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత వివి వినాయక్ తో ఒక సినిమా చేయాలని తన మొదటి సినిమాను వినాయక్ డైరెక్షన్ లోనే చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నప్పుడు వివి వినాయక్ దిల్ రాజు ఇద్దరు కలిసి బేగంపేట్ వెళ్తున్న క్రమంలో అక్కడ జయం సినిమా పెద్ద పోస్టర్ కనిపించిందట. అప్పుడు వినాయక్ ఆ కుర్రాడు ఎవరన్నా బాగున్నారని అడగడంతో మా సుధాకర్ రెడ్డి కొడుకు అని దిల్ రాజు చెప్పారట. మరి నీ ఫస్ట్ సినిమా అతనితోనే చేద్దామన్న అని వినాయక్ చెప్పినట్టుగా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు చెప్పడం విశేషం… దిల్ రాజు మొదటి సినిమా నితిన్ తో దిల్(Dil) చేసి రాజుగా ఉన్న పేర్లు కాస్త దిల్ రాజుగా మార్చుకున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట దిల్ రాజు మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులనేది ఆకట్టుకోవడం లేదు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి పెద్దగా కలిసి రావడం లేదు. దాంతో ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read: గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ కి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో తెలుసా..?
తను అనుకున్నట్టుగానే ఇకమీదట రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే గేమ్ చేంజర్ (Game Changer) సినిమాతో భారీగా డిజాస్టర్ ని ముడగట్టుకున్న దిల్ రాజు రీసెంట్ గా నితిన్ తో చేసిన తమ్ముడు (Tammudu) సినిమాతో కూడా భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికి ఈ రెండు సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో దిల్ రాజు పేరు మరింత చెడిపోయిందనే చెప్పాలి. మరి రాబోయే సినిమాలతో అయిన సూపర్ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక స్టాండర్డ్ ఏర్పాటు చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిగా వెయిట్ చేయాల్సిందే…