Vijay Deverakonda mistake movie: రౌడీ హీరోగా తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ… ‘పెళ్లిచూపులు’ సినిమాతో సాఫ్ట్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన అర్జున్ రెడ్డి సినిమాతో రగ్గుడ్ హీరోగా మారిపోయాడు. తనలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని ఎవరు గమనించలేకపోయారు. నిజానికి అర్జున్ రెడ్డి సినిమాను చూసిన ప్రతి ఒక్కరు విజయ్ నటన మీద ప్రశంసల వర్షాన్ని కురిపించారు. అలాంటి నటుడు ఇండస్ట్రీకి దొరకడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అని చెప్పారు. ఇక ఆ తర్వాత చేసిన ‘గీతా గోవిందం’ సినిమాతో 100 కోట్ల మార్క్ ను టచ్ చేసిన ఆయన మరో రెండు సినిమాలతో టైర్ వన్ హీరోగా మారబోతున్నాడు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేశారు. ఇక అప్పుడే ఆయన నోటా అనే సినిమాను రిలీజ్ చేసి బొక్క బోర్లా పడ్డాడు. ఆ సినిమా వల్లే ఆయన టైర్ వన్ హీరోగా మారలేకపోయాడనేది వాస్తవం. ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడంతో విజయ్ దేవరకొండ చాలా వరకు తన కెరియర్ ను కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఇక ఆ సినిమా నుంచి ఇప్పటివరకు ఆయనకు భారీ సక్సెస్ సాధించలేకపోయాడు. వరుసగా ఆడపాదడప సినిమాలు వస్తున్నప్పటికి అవి ఆయన రేంజ్ సక్సెసులనైతే సాధించలేకపోతున్నాయి. ప్రస్తుతం టైర్ వన్ హీరో కోసం నాని, విజయ్ దేవరకొండ మధ్య తీవ్రమైన పోటీ ఉన్న విషయం మనకు తెలిసిందే.
నాని మాత్రం వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉంటే విజయ్ దేవరకొండ మాత్రం ఒక్క సక్సెస్ ని సాధించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. నిజానికి అర్జున్ రెడ్డి సినిమా తర్వాత నాని కంటే కూడా విజయ్ దేవరకొండకి టైర్ వన్ హీరోగా మారే అవకాశాలైతే ఎక్కువగా ఉండేవి. కానీ ఆయన తన తదుపరి సినిమాలను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల డీలా పడిపోవాల్సిన ప్రమాదం ఏర్పడింది.
ప్రస్తుతం నాని లైనప్ అద్భుతంగా ఉండటం వల్ల ఆయన మరో రెండు సినిమాలతో టైర్ వన్ హీరోగా మారుతాడు అనేది వాస్తవం…ఇక విజయ్ దేవరకొండ సైతం నోటా అనే సినిమా చేయకుండా ఉంటే బాగుండేది. ఇక ఇప్పటికైనా కథల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే మంచిదని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…