Venkatesh And Krishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు (NTR) గారు ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఆయన తర్వాత ఏఎన్నార్ (ANR) తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా వరకు తీవ్రమైన ప్రయత్నం అయితే చేశారు. వీళ్లిద్దరి తర్వాత సూపర్ స్టార్ కృష్ణ (Krishna) తెలుగు సినిమా ఇండస్ట్రీని మరో మెట్టు పైకి ఎక్కించారనే చెప్పాలి… ఇక ఒకానొక సమయంలో సూపర్ స్టార్ కృష్ణ మూడు షిఫ్టులుగా సినిమాలను చేస్తూ తొందరగా సినిమాలను కంప్లీట్ చేసి ఎక్కువ సంఖ్యలో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ చాలా బిజీగా ఉన్న సందర్భంలో ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు తన సినిమాల కోసం కృష్ణ గారిని తనకి డేట్స్ ఇవ్వమని అడగగా కృష్ణ మాత్రం తన డేట్స్ మొత్తం బిజీగా ఉన్నాయని కాల్షీట్స్ ఇచ్చే పరిస్థితిలో తను లేనని చెప్పడంతో స్టార్లతో విసిగిపోయిన రామానాయుడు తన కొడుకుని హీరోగా మార్చాలనే ఉద్దేశ్యంతో వెంకటేష్ ను అమెరికా నుంచి హైదరాబాద్ రప్పించి రాఘవేంద్రరావు గారితో కలియుగ పాండవులు (Kaliyuga Pandavulu) అనే సినిమా చేయించాడు. మొత్తానికైతే వెంకటేష్ ఆ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
Also Read: కోటాను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన బ్రహ్మానందం… వీడియో వైరల్
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికి కూడా సోలో హీరోగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో వెంకటేష్ మొదటి స్థానంలో ఉన్నాడు.శోభన్ బాబు తర్వాత ఆ ప్లేస్ ను భర్తీ చేసిన హీరో కూడా తనే కావడం విశేషం…తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ఫోర్ హీరోల్లో తను కూడా ఒకడిగా నిలిచాడు… ఇక కలియుగ పాండవులు సినిమా సక్సెస్ అయిన తర్వాత 100 డేస్ ఫంక్షన్ కి సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిధిగా వచ్చారట. ఇక ఆ సందర్భంలోనే కృష్ణ మాట్లాడుతూ నా వల్లే వెంకటేష్ హీరోగా మారాడు అంటూ రామానాయుడు గారితో చెప్పారట.
కృష్ణ అలా అనడం తో రామానాయుడు కూడా నవ్వుకున్నాడట. ఇక కృష్ణ దానికి వివరణ ఇస్తూ నేను డేట్స్ ఇవ్వకపోవడం వల్లే మీరు వెంకటేష్ ను హీరోగా చేశారు అంటూ ఆయన మాట్లాడిన మాటలు అప్పట్లో పెను సంచలనాలను క్రియేట్ చేశాయనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా వెంకటేష్ ఇప్పుడు సీనియర్ హీరోగా ఉన్నప్పటికి మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…