Raghuveera Reddy : తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటోంది. పార్టీలోకి ఇతర పార్టీల నేతల్ని తీసుకొచ్చేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దీంతో ఒకప్పటి కాంగ్రెస్ మాజీ మంత్రి, సీనియర్ నేత రఘువీరారెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్రనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీడీపీ కొన్నాళ్లుగా నాయకత్వ లోపంతో బాధపడుతోంది. సీనియర్లు లేక పార్టీ అధ్వాన స్థితిలో పడిపోయింది. ప్రస్తుతం పార్టీకి జవసత్వాలు నింపే పనిలో నేతలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన రఘువీరా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన టీడీపీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరినా బీజేపీలో చేరినా ఒకటే ప్రయోజనం ఉండటంతో టీడీపీలో చేరాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రఘువీరా చేరికకు చంద్రబాబు కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది.
టీడీపీకి కూడా సీనియర్ నేతల అవసరం ఏర్పడినందున రఘువీరా చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు కష్టకాలంలో పార్టీని వదిలేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిన సందర్భంలో టీడీపీలో రఘువీరా చేరాలని నేతలు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని గట్టెక్కించాలంటే రఘువీరా లాంటి నేతల అవసరం ఎంతైనా ఉందని గుర్తిస్తున్నారు.
Also Read: Power: పవన్ కల్యాణ్ ‘పవర్’ చూపించాల్సిన టైం వచ్చిందా?
కాగా రఘువీరాకు ఇప్పటికే టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలుండడం కూడా ప్లస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రఘువీరా సన్నిహిత వర్గమంతా టీడీపీలో చేరాలని భావిస్తోంది. కానీ ఇన్నాళ్లుగా రాజకీయాలు పట్టించుకోని రఘువీరాతో అందరు సన్నిహితంగా లేరని తెలుస్తోంది. చాలా మంది ఇతర పార్టీల్లో చేరిపోయినట్లు చెబుతున్నారు. ఎవరైనా మిగిలి ఉంటే వారితోనే పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
Also Read: CM Jagan: ఇంకా రెండేళ్లే మిగిలింది.. ప్రజలను మెప్పించేందుకు జగన్ ఏం చేయనున్నారు?