https://oktelugu.com/

RGV vs AP Govt: ఆర్జీవీతో ఏపీ ప్రభుత్వం చేతులు కాలాయా?

RGV vs AP Govt: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారిందట ఏపీ ప్రభుత్వం పరిస్థితి. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత గాయి చేస్తుందో మన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా అంతే.. ఏపీలో ఉన్నాడు కాబట్టి నిన్న కాస్త సాఫ్ట్ గా మాట్లాడాడు. ఇప్పుడు తెలంగాణలోని హైదరాబాద్ కు వచ్చేసరికి రాంగోపాల్ వర్మ మాట మార్చేశాడు. తాజాగా ట్వీట్లతో విరుచుకుపడ్డాడు. మహారాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర వాడు కానప్పటికీ రాజమౌళి ఆర్ఆర్ఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2022 12:47 pm
    Follow us on

    RGV vs AP Govt: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారిందట ఏపీ ప్రభుత్వం పరిస్థితి. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత గాయి చేస్తుందో మన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా అంతే.. ఏపీలో ఉన్నాడు కాబట్టి నిన్న కాస్త సాఫ్ట్ గా మాట్లాడాడు. ఇప్పుడు తెలంగాణలోని హైదరాబాద్ కు వచ్చేసరికి రాంగోపాల్ వర్మ మాట మార్చేశాడు.

    RGV vs AP Govt

    RGV vs AP Govt

    తాజాగా ట్వీట్లతో విరుచుకుపడ్డాడు. మహారాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర వాడు కానప్పటికీ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.2200 ధర నిర్ణయించారని.. అదే ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడైనా ఇక్కడి ప్రభుత్వం కేవలం రూ.200 మాత్రమే ధర నిర్ణయించిందని .. ‘కట్టప్పను చంపింది ఎవరు?’ అంటూ ఏపీ ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ మరోసారి విరుచుకుపడ్డాడు.

    Also Read:  ‘హీరో’లో కృష్ణ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!

    ఉత్తర భారతదేశంలోనూ ఐమాక్స్ లలో టికెట్ రేటును రూ.2200 పెట్టారని.. కానీ ఏపీలో పుట్టిన రాజమౌళికి ఆ ప్రభుత్వం ఏం గౌరవం ఇస్తుందని వర్మ ప్రశ్నించారు.

    ఏపీలో ఉండగా రాంగోపాల్ వర్మ చాలా పద్ధతిగానే మాట్లాడారు. జగన్ ను, పేర్నినానిని ఏమీ అనలేదు. వారి ప్రభుత్వ విధానం అని.. నా సలహాలు పాటిస్తారని ఆశిస్తున్నానని వెనకేసుకొచ్చాడు.

    కానీ హైదరాబాద్ రాగానే వర్మలోని అసలైన అపరిచితుడు మేల్కొన్నాడు. మీడియా ముందుకొచ్చి ఏపీ ప్రభుత్వం తీరును.. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి టాలీవుడ్ పై తిట్టిన విధానాన్ని.. ఆఖరుకు మంత్రి పేర్నినానిపై కూడా విమర్శలు గుప్పించారు. ‘వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఇడియట్ అని.. ఇలాంటి వారి వల్లే జగన్ పై గౌరవం పోతోందని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మంత్రి పేర్ని నాని సైతం టికెట్ రేట్ల విషయంలో వ్యవహరించే విధానం సరికాదని వర్మ హైదరాబాద్ కొచ్చాక విరుచుకుపడ్డారు.

    వర్మ లాంటి వివాదాస్పద దర్శకుడిని అసలు కెలకడమే పెద్ద తప్పు.. కెలికి మరీ వదిలేశారు. ఇప్పుడు వదలుతాడా? ఉదహారణలతో సహా ఏపీ సర్కార్ ను చెడుగుడు ఆడుతున్నారు. ఇలాగే కొనసాగితే ఏపీ ప్రభుత్వాన్ని మరింత డ్యామేజ్ చేస్తాడు. వర్మ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు నిజంగానే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.