https://oktelugu.com/

Renu Desai: అకీరాకి కరోనా పాజిటివ్.. పవన్ సాయం నిరాకరించిన రేణూ దేశాయ్ ! కారణమిదే

Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, అలాగే అకీరా నందన్ కూడా కరోనా బారిన పడ్డారు. తమకు కోవిడ్ -19 పాజిటివ్ అని తాజాగా రేణూ దేశాయ్ తెలియజేసింది. వాస్తవానికి తమకు గత కొన్ని రోజుల కితమే కరోనా పాజిటివ్ అని, ప్రస్తుతం తాము పూర్తిగా కోలుకుంటున్నాం అని రేణు తెలిపింది. ఇక ఆమె మెసేజ్ చేస్తూ.. తాను ఆల్రెడీ రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నాను అని, అయినప్పటికీ నాకు […]

Written By:
  • Shiva
  • , Updated On : January 11, 2022 / 12:14 PM IST
    Follow us on

    Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, అలాగే అకీరా నందన్ కూడా కరోనా బారిన పడ్డారు. తమకు కోవిడ్ -19 పాజిటివ్ అని తాజాగా రేణూ దేశాయ్ తెలియజేసింది. వాస్తవానికి తమకు గత కొన్ని రోజుల కితమే కరోనా పాజిటివ్ అని, ప్రస్తుతం తాము పూర్తిగా కోలుకుంటున్నాం అని రేణు తెలిపింది. ఇక ఆమె మెసేజ్ చేస్తూ.. తాను ఆల్రెడీ రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నాను అని, అయినప్పటికీ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది అని ఆమె చెప్పింది.

    Renu Desai

    అలాగే ఆమె అకీరా నందన్ గురించి చెబుతూ.. ‘అకీరా నందన్ కి వ్యాక్సిన్ వేయిద్దాం అని అప్పుడే ప్లాన్ చేశాను. కానీ, ఆ లోపు వాడికి కూడా రిపోర్ట్ లో పాజిటివ్ అని వచ్చింది’ అని రేణు మెసేజ్ చేసింది. ఈ వార్త తెలియగానే అకీరా నందన్ ఎలా ఉన్నాడు ? అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతున్నారు. ప్రస్తుతానికి అయితే, రేణు దేశాయ్ – అకీరా కోలుకుంటున్నారు అని, వారు ఆరోగ్యం పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని రేణు సన్నిహితులు స్పష్టం చేశారు.

    Also Read:  ఆర్జీవీతో ఏపీ ప్రభుత్వం చేతులు కాలాయా?

    అయితే, ఈ విషయం అసలు పవన్ కి తెలియదు అట. రేణు దేశాయ్ కావాలనే పవన్ కి చెప్పలేదు అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చూసి చరణ్ రియాక్ట్ అయ్యాడని.. అపోలో నుంచి డాక్టర్స్ బృందాన్ని ఆమె ఇంటికి పంపాడని.. అయినా రేణు దేశాయ్ మాత్రం వాళ్ళ సాయం తీసుకోవడానికి నిరాకరించింది అని తెలుస్తోంది. పవన్ పై గత కొన్ని రోజులుగా రేణు చాలా సీరియస్ గా ఉందట.

    తమ పిల్లలను సరిగ్గా చూసుకోవడంలో పవన్ విఫలం అయ్యాడని.. అందుకే, తన పిల్లలను తాను చూసుకోగలను అని, ఆమె పవన్ సన్నిహితుల దగ్గర స్పష్టం చేసిందట. ఏది ఏమైనా ఫ్యామిలీ సమస్యలతో పవన్ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నట్లు అర్ధం అవుతుంది. ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని అసలు ఊహించలేదు.

    పైగా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక సినిమా మేకర్స్ మళ్ళీ ఆందోళన బాట పట్టారు. ఎందుకంటే ఒకవేళ పొరపాటున షూటింగ్ స్పాట్స్ లో కరోనా కేసులు గానీ నమోదు అయితే.. ఇక అంతే సంగతులు.

    Also Read:  మొన్న సమంత, నేడు సైనా.. పరువు పోగొట్టుకుంటున్న హీరో !

    Tags