https://oktelugu.com/

Krishna Vamshi : ప్రభాస్ గురించి ఒక సంచలన సీక్రెట్ బయటపెట్టిన కృష్ణవంశీ.. అంతా అవాక్కు.. ఇండస్ట్రీలో వైరల్!

రీసెంట్ గా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో 'చక్రం' లాంటి సున్నితమైన కథ లో ప్రభాస్ ని ఎంచుకోవాలని ఎందుకు అనుకున్నారు అని యాంకర్ ఒక ప్రశ్న అడగగా, దానికి కృష్ణ వంశీ సమాధానం చెప్తూ 'ప్రభాస్ ఒక అద్భుతమైన నటుడు. మన టాలీవుడ్ దర్శకులు ఆయన్ని సరిగా ఉపయోగించుకోవడం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : October 16, 2024 9:05 pm
    Krishna Vamshi

    Krishna Vamshi

    Follow us on

    Krishna Vamshi :  టాలీవుడ్ లో లవ్ స్టోరీస్, హిస్టారికల్, యాక్షన్, మాస్, క్లాస్, ఫ్యామిలీ అని తేడా లేకుండా ప్రతీ జానర్ కి పనికొచ్చే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది రెబెల్ స్టార్ ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి కటౌట్, అందం, నటన ఆయన సొంతం. అలాంటి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే ప్రభాస్ ని ఇప్పటి టాలీవుడ్ డైరెక్టర్స్ సరిగా వాడుకోవడం లేదని ప్రముఖ సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. గతం లో ఆయన ప్రభాస్ తో చక్రం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా, ప్రభాస్ కెరీర్ లో ఒక చక్కటి ఫీల్ గుడ్ మూవీ గా ఆ చిత్రం నిలిచిపోయింది. మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు.

    రీసెంట్ గా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో ‘చక్రం’ లాంటి సున్నితమైన కథ లో ప్రభాస్ ని ఎంచుకోవాలని ఎందుకు అనుకున్నారు అని యాంకర్ ఒక ప్రశ్న అడగగా, దానికి కృష్ణ వంశీ సమాధానం చెప్తూ ‘ప్రభాస్ ఒక అద్భుతమైన నటుడు. మన టాలీవుడ్ దర్శకులు ఆయన్ని సరిగా ఉపయోగించుకోవడం లేదు. ఎంతసేపు ఆ కటౌట్ తో ఫైట్స్ ఎలా చేయించాలి అని చూస్తారే తప్ప, ప్రభాస్ లోని నటుడిని గుర్తించట్లేదు. అప్పట్లో నేను ప్రభాస్ కి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక యాక్షన్ కథ చెప్పాను, అలాగే చక్రం సినిమా కథని కూడా చెప్పాను. ప్రభాస్ చక్రం చిత్రాన్ని ఎంచుకున్నాడు. ఇంత సున్నితమైన కథలో నీ అభిమానులు నిన్ను చూసేందుకు ఇష్టపడుతారా అని అడిగితే, అందరూ నా దగ్గరకి యాక్షన్ కథలతోనే వస్తున్నారు సార్, బోర్ కొట్టేస్తుంది అని అన్నాడు. అప్పటికీ ఇప్పటికీ 20 ఏళ్ళు తేడా వచ్చింది. ఇప్పటికీ ప్రభాస్ లో ఏ మార్పు లేదు. అందరూ యాక్షన్ కథలకే ఆయన్ని వాడుకుంటున్నారు. అప్పట్లో నేను ప్రభాస్ కి చెప్పిన యాక్షన్ కథతో ఇప్పుడు కూడా సినిమా తియ్యొచ్చు. కానీ ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయింది. వందల కోట్ల ప్రాజెక్ట్స్ ని వరుసగా ఒప్పుకున్నాడు. వాటి అన్నిటినీ పక్కన పెట్టి నాతో సినిమా చెయ్యమని అడిగే పరిస్థితి లేదు కదా’ అని చెప్పుకొచ్చాడు కృష్ణ వంశీ.

    కృష్ణ వంశీ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. ప్రభాస్ లో మంచి నటుడు ఉన్నాడు, కానీ బాహుబలి సిరీస్ ని పక్కన పెడితే, ప్రభాస్ నటన అంటే గుర్తుకు వచ్చే సినిమాలు రెండు మూడు కూడా లేవు. కారణం ఆయన తన కెరీర్ లో ఎక్కువ శాతం మాస్,యాక్షన్ సినిమాలే చేసాడు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి లవ్ స్టోరీస్ చేసాడు కానీ, అందులో మామూలు యాక్టింగ్ మాత్రమే ఉంటుంది. చరిత్ర లో ప్రభాస్ నటనని చిరకాలం గుర్తించుకోదగ్గ సినిమాలు బాహుబలి సిరీస్ తప్ప మరొకటి లేదు. మరి ప్రభాస్ లోని నటుడిని సరిగ్గా వాడుకునే దర్శకుడు రాబోయే రోజుల్లో వస్తాడో లేదో చూడాలి.

    &