Sarath Babu Passed Away
Sarath Babu Passed Away: తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో లెజెండ్ ని కొలిపోయింది. సుమారుగా 250 కి పైగా సినిమాల్లో హీరో గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా తెలుగు , తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో నటించిన శరత్ బాబు చూసేందుకు హాలీవుడ్ హీరో లాగా అనిపిస్తాడు. ఉత్తరప్రదేశ్ నుండి 1950 వ సంవత్సరం లో శ్రీకాకుళం వచ్చిన శరత్ బాబు కుటుంబం ఇక్కడే స్థిరపడిపోయింది. ఆయన విద్యాబ్యాసం కూడా ఇక్కడే జరిగింది.కె బాలచందర్ దర్శకత్వం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరో గా నటించిన శరత్ బాబు, ఆ తర్వాత విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాలు చేసాడు.
అలాంటి లెజెండ్ ఈరోజు కాసేపటి క్రితమే ప్రాణాలను కోల్పోవడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. గత కొంతకాలం నుండి ఆయన వయసు పెరగడం తో శరీరం మొత్తం సెప్సిస్ కావడం తో ఊపిరి తిత్తులు, కాలేయం మరియు కిడ్నీ వంటి ప్రధాన అవయవాలు చెడిపోయాయి.
దీనితో ఆయనని వెంటనే చెన్నై హాస్పిటల్ కి తరలించారు, కానీ ఆయన పరిస్థితి మరింత విషమించడం తో అక్కడి డాక్టర్లు హైదరాబాద్ AIG హాస్పిటల్స్ లో చేర్చండి అని సలహా ఇవ్వడం తో ఆయనని AIG హాస్పిటల్స్ కి తరలించారు. అక్కడ ఆయనని ICU లో పెట్టి సుమారుగా నెల రోజుల పాటు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ నెల రోజులు శరత్ బాబు మీద సోషల్ మీడియా లో ఎన్నో వార్తలు వచ్చాయి. కొంతమంది ఆయన చనిపోయాడని కూడా చెప్పారు, అయితే కుటుంబ సభ్యులు అలాంటిది ఏమి లేదని, ఆయన సురక్షితంగానే ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని చెప్పడం తో శరత్ బాబు ని అభిమానించే వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకున్నారు, కానీ ఇంతలోపే ఇలా జరిగిపోవడం దురదృష్టకరం.
అయితే శరత్ బాబు ఇలా చనిపోవడానికి కారణం ఆయన తరచూ డాక్టర్ చెకప్ చేయించుకోకపోవడమే అని అంటున్నారు. ముందుగానే ఆయన రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉంది ఉంటే, ఈరోజు ఆయనకీ ఇంత సీరియస్ అయ్యేది కాదని, శరీరం లోని ప్రధాన అవయవాలు దెబ్బ తినే స్థాయి వచ్చేవరకు ఆయన ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదని, ఆయన చేసిన ఈ పొరపాటు ఈరోజు ఆయన ప్రాణాలను పోగొట్టుకునేలా చేసిందని అంటున్నారు.