https://oktelugu.com/

Photo Story: ఈ కుర్రాడు నవ్వడమే కాదు.. కోట్ల మందికి నవ్వు తెప్పించాడు.. ఆయనవెవరో చెప్పుకోండి..

పక్కా తెలంగాణ యాసలో మాట్లాడిన ఈ కమెడియన్ పేరు వేణు మాధవ్. నల్గొండ జిల్లాకు చెందిన వేణు మాధవ్ కు చిన్నప్పటి నుంచి కమెడియన్ అవ్వాలని ఎవరూ ప్రోత్సహించలేదు. కొందరి దగ్గర ఆయన కామెడీ ఎలా చేయాలో నేర్చుకున్నాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 22, 2023 / 04:52 PM IST

    Photo Story

    Follow us on

    Photo Story: సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావాలంటే ఎంతో కృషి పట్టుదల ఉండాలి. అలా సినిమాల్లో ఛాన్స్ వచ్చినా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ధైర్యం ఉండాలి. కొంత మంది నటులకు సినిమాల్లో ఛాన్స్ వచ్చినా పూర్తికాలం ఇండస్ట్రీలో ఉండలేకపోయారు. కొన్ని సినిమాల్లో మాత్రమే నటించి.. ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేని కొందరు స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఒకప్పుడు సినిమాల్లో కామెడీని ప్రధానంగా చూపించేవారు. అలా కమెడియన్లకు గుర్తింపు వచ్చింది. పై ఫొటోలోని కుర్రాడు తన డైలాగ్ లతో నవ్వు తెప్పించి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మిమిక్రీతో మెస్మరైజ్ చేశాడు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో తెలుసా?

    పక్కా తెలంగాణ యాసలో మాట్లాడిన ఈ కమెడియన్ పేరు వేణు మాధవ్. నల్గొండ జిల్లాకు చెందిన వేణు మాధవ్ కు చిన్నప్పటి నుంచి కమెడియన్ అవ్వాలని ఎవరూ ప్రోత్సహించలేదు. కొందరి దగ్గర ఆయన కామెడీ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ముందుగా ఆయన వెంట్రిలాక్విజం నేర్చుకొని ప్రదర్శనలు ఇచ్చేవారు. ఈ క్రమంలో ఓ స్టేజీపై పర్ఫామెన్స్ ఇవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే దృష్టిలో పడ్డాడు. దీంతో ఆయన ఎన్టీఆర్ కు పరిచయం చేయించాడు. ఆ తరువాత వేణుమాధవ్ కు కృష్ణ నటించిన ‘సాంప్రదాయం’ అనే సినిమాలో తొలిసారిగా నటించే అవకాశం వచ్చింది.

    ఆ తరువాత వేణుమాధవ్ కు పవన్ కల్యాణ్ సినిమా ‘తొలిప్రేమ’తో గుర్తింపు వచ్చింది. ఆయన కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ అయ్యారు. దిల్, చత్రపతి, సై సినిమాల్లో వేణు మాధవ్ నటనకు ఎవరూ తీసిపోరని తెలుస్తుంది. ఇలా మొత్తం 400 సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డికి వేణు మాధవ్ మొదట్లోనే నచ్చారు. దీంతో ఆయన సినిమాల్లో కచ్చితంగా అవకాశం ఇచ్చేవారు. హంగామా అనే సినిమాలో అయనకు సైడ్ హీరో ఇవ్వడం చూస్తే ఆయన అంటే ఎంత అభిమానమోతెలుస్తుంది.

    వేణుమాధవ్ హీరోగా భూ కౌలాస్ తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించారు. అయితే అవేవీ గుర్తింపు ఇవ్వలేదు. మళ్లీ కమెడియన్ గానే కొన్ని సినిమాల్లో కనిపించారు. అయితే లంగ్స్ సమస్య ల వల్ల వేణుమాధవ్ అకాల మరణం చెందారనే అనుకోవచ్చు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోవడంతో కామెడీ లోటు బాగా ఉందని కొందరు సినీజనం చర్చించుకుంటున్నారు.