Sudheer: ప్రస్తుతం బుల్లితెరపై, వెండితెరపై ఒక వెలుగు వెలుగుతున్న కమెడియన్లలో సుడిగాలి సుధీర్ ఒకరు. ఈటీవీ ఛానల్ లోని చాలా షోలు సుధీర్, ఆది వల్లే హిట్ అయ్యాయని చాలామంది భావిస్తారు. ఒక ఇంటర్వ్యూలో సుధీర్ మాట్లాడుతూ తన కన్నీటి కష్టాలను చెప్పుకొచ్చారు. ఇంటర్ మధ్యలో చదువుకు గ్యాప్ వచ్చిందని ఆ సమయంలో నాన్నకు యాక్సిడెంట్ కావడంతో కాలికి ఫ్రాక్చర్ అయిందని సుధీర్ వెల్లడించారు.
నాన్న కాలికి రాడ్ వేశారని నాన్న షుగర్ పేషెంట్ కావడంతో కుటుంబ సభ్యులంతా చాలా టెన్షన్ పడ్డామని సుధీర్ పేర్కొన్నారు. నాన్న బెడ్ మీద ఉండటంతో కొడుకుగా ఇంటి బాధ్యతలను తాను తీసుకున్నానని సుధీర్ చెప్పుకొచ్చారు. నేను హైదరాబాద్ కు వచ్చే సమయంలో నాన్న ఏడ్చేశారని సుధీర్ వెల్లడించారు. ఇంటినుంచి వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో రెండేళ్లు జాబ్ చేశానని సుధీర్ తెలిపారు.
Also Read: Acharya Movie First Review: ఆచార్య మూవీ ‘ఫస్ట్’ రివ్యూ.. హిట్టా ఫట్టా?
ఫిల్మ్ సిటీలో 8,000 రూపాయల జీతంతో తన కెరీర్ మొదలైందని ఖర్చుల కోసం 500 రూపాయలు ఉంచుకుని మిగతా డబ్బులు ఇంటికి పంపించేవాడినని సుధీర్ వెల్లడించారు. ఫిల్మ్ సిటీలో పని చేసే సమయంలో ఫుడ్, బెడ్ ఖర్చు ఉండేది కాదని నాన్నతో మాట్లాడటానికి, ఇంటర్నెట్ కు మాత్రమే డబ్బులు ఖర్చు చేసేవాడినని సుధీర్ పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో చేసే జాబ్ కు వీకాఫ్ ఉండదని రెండేళ్ల తర్వాత జీతం 30,000 రూపాయలు అయిందని సుధీర్ చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత జాబ్ మానేయడంతో కష్టాలు పెరిగాయని డబ్బులు లేక సింక్ లో నీళ్లు తాగేవాడినని అన్నంలోకి పచ్చడి తినేవాడినని సుధీర్ వెల్లడించారు. జబర్దస్త్ షోలో చేసిన తర్వాత జీవితం మారిపోయిందని ప్రస్తుతం పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారని సుధీర్ వెల్లడించారు. సుధీర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read: Vijayawada Crime: ఆడబిడ్డల మానానికి రక్షణేది? ఏపీ నడిబొడ్డున సామూహిక అత్యాచారం
Recommended Videos: