https://oktelugu.com/

Balakrishna: ఆ షోలో హీరో బాలకృష్ణను ఘోరంగా అవమానించారా.. గాడిద అంటూ?

Balakrishna: స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ షోలలో కామెడీ స్టార్స్ షో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ షో ప్రోమో తాజాగా విడుదల కాగా ఆర్ఆర్ఆర్ మూవీకి పేరడీ స్కిట్ చేశారు. షోలో అవినాష్ మొదట భీమ్ గెటప్ లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే రామరాజు పాత్రను చిరంజీవి భీమ్ పాత్రను బాలకృష్ణ పోషిస్తే ఏ విధంగా ఉంటుందో చెబుతూ ఈ స్కిట్ చేశారు. పులి గెటప్ లో ఉన్న వ్యక్తి పులి ఇక్కడ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 22, 2022 / 09:23 AM IST
    Follow us on

    Balakrishna: స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ షోలలో కామెడీ స్టార్స్ షో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ షో ప్రోమో తాజాగా విడుదల కాగా ఆర్ఆర్ఆర్ మూవీకి పేరడీ స్కిట్ చేశారు. షోలో అవినాష్ మొదట భీమ్ గెటప్ లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే రామరాజు పాత్రను చిరంజీవి భీమ్ పాత్రను బాలకృష్ణ పోషిస్తే ఏ విధంగా ఉంటుందో చెబుతూ ఈ స్కిట్ చేశారు. పులి గెటప్ లో ఉన్న వ్యక్తి పులి ఇక్కడ అని చెప్పగా అవినాష్ సింహం ఇక్కడ అని చెబుతాడు.

    Balakrishna

    పులి గెటప్ లో ఉన్న కమెడియన్ రిస్క్ చేస్తున్నావ్ అని చెప్పగా నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే రిస్క్ నేను నీకు ఎదురొచ్చినా నీకే రిస్క్ అని చెబుతాడు. రా చూసుకుందాం అని కమెడియన్ చెప్పగా అవినాష్ చెంపపై కొడుతూ ఏంట్రా గాడిదా నీతో చూసుకునేది అంటూ కామెంట్ చేస్తారు. ఆ తర్వాత అభి రామరాజు గెటప్ లో ఎంట్రీ ఇస్తాడు. హీరోయిన్ అవినాష్ ను భయ్యా అని పిలవగా అవినాష్ భయ్యా కాదు బాలయ్య అని పంచ్ వేస్తారు.

    Also Read: KTR- BJP- Congress: రివర్స్‌ పంచ్‌: కేటీఆర్‌ పై కాంగ్రెస్, బీజేపీ కౌంటర్‌ అటాక్‌!

    ఆ తర్వాత అవినాష్, అభి నాటునాటు పాటకు స్టెప్పులు వేశారు. డ్యాన్స్ చేసిచేసి చాలా ఆకలిగా ఉంది అని అవినాష్ చెప్పగా నీకు ఆకలి వేస్తుందని చెబితే చిటికెలో చిరుదోశ చేసి తినిపిస్తా అని అభి చెబుతాడు. ఆ తర్వాత పాము రూపంలో ఉన్న వ్యక్తి అభిని కాటు వేయడానికి వెళితే అవినాష్ హేయ్.. ఇలా రా గాడిద అని పిలుస్తాడు. అతను నా ప్రాణ స్నేహితుడని అతడినే కాటు వేద్దామని అనుకుంటున్నావా అని అవినాష్ చెప్పడంతో పాటు నీకు నువ్వే కాటేసుకో అని పాము రూపంలో వ్యక్తికి చెబుతాడు.

    ఆ తర్వాత పాములా ఉన్న వ్యక్తి కాటేసుకుని చనిపోతాడు. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం బాలయ్యను అవమానించేలా అవినాష్ పాత్ర ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.

    Also Read: Vijayawada Government Hospital: విజయవాడలో దివ్యాంగురాలైన యువతిపై గ్యాంగ్ రేప్? చివరకు ఏమైంది?

    Recommended Videos: