Pawan Kalyan And Sujeeth: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా వాళ్లకంటు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కాబట్టి వాళ్లతో పాటు సినిమాలు చేయడానికి చాలా మంది స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తారు. దాంతో వాళ్ళు చేస్తున్న సినిమాకి భారీ బజ్ అయితే వస్తోంది. అందుకే ప్రేక్షకులు సైతం వాళ్ళ సినిమాలను చూసి సక్సెస్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం ఇప్పుడు చేస్తున్న సినిమాలతో చాలా మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. అయినప్పటికి ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారీ సినిమాలను చేయడానికి చాలా వరకు ఆసక్తి చూపిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… పొలిటికల్ గా స్ట్రాంగ్ లీడర్ గా ఎదుగుతున్నప్పటికీ తన అభిమానులు కోరిక మేరకు మాత్రమే ఆయన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అతనికి డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు ఆయన ఎన్ని ఫ్లాపు సినిమాలను చేసినప్పటికి ఆయన క్రేజ్ అయితే ఎక్కడ తగ్గదు. అలాగే ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా ఉండదు. అందువల్లే ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సైతం ఆసక్తి చూపిస్తూ ఉంటారు…ఇక ప్రస్తుతం ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించడానికి ఈనెల 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఇప్పటివరకు బాగానే ఉంది కానీ ఓ.జి సినిమా విషయంలో డైరెక్టర్ సుజిత్ చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటు ముందుకు సాగుతున్నాడు.
Also Read: అసలు ఎవరు ఈ ఒమీ..ఓజాస్ గంభీర కంటే పవర్ ఫుల్ నా..? బ్యాక్ స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు!
మరి ఏది ఏమైనా కూడా ఓజీ విషయంలో సుజిత్ ఒక్క తప్పైతే చేశాడు అంటూ ప్రేక్షకుల నుంచి కొన్ని అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇంతకుముందు ఆయన చేసిన బాలు, పంజా సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
మరి వాటికి మించి ఈ సినిమాలో సుజీత్ పవన్ కళ్యాణ్ ని చూపించాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాడు. మరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
పవన్ కళ్యాణ్ సినిమాల విషయం లో అంచనాలు హెవీ గా ఉంటే కొంచెం ఇబ్బంది అవుతోంది…ఇప్పటికైతే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెంచేశాడు…ఇక సుజీత్ సైతం పవన్ కళ్యాణ్ విషయంలో ఆ తప్పు చేశాడు…మరి దీని రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనేది తెలియాల్సి ఉంది…