Sujeeth OG: ఈ ఏడాది టాప్ ఇండియన్ గ్రాసర్స్ లో ఒకటిగా నిల్చిన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం, అభిమానులకు ఒక మర్చిపోలేని అందమైన జ్ఞాపకం. ఈ సినిమా విడుదలకు ముందు క్రియేట్ చేసిన హైప్, క్రేజ్ అభిమానులు ప్రతీ క్షణం ఎంజాయ్ చేశారు. ఇక విడుదల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్, రికార్డ్స్, ఇలా గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ నుండి మిస్ అవుతున్న ప్రతీ ఒక్కటి ఈ సినిమా ద్వారా కళ్లారా చూస్తూ అభిమానులుగా ది బెస్ట్ అనుభూతిని పొందారు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, నార్త్ అమెరికా లో 3 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు కేవలం ప్రీమియర్ షోస్ నుండి రావడం, ఫుల్ రన్ లో ‘కాంతారా 2’ పాజిటివ్ టాక్ సినిమాని ఎదురుగా పెట్టుకొని కూడా 316 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడం , ఇలా ఒక్కటా రెండా, ఈ సినిమా సృష్టించిన అద్భుతాలు ఎన్నో.
నిర్మాతల జాప్యం వల్ల పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో విడుదల చేయలేకపోయారు. చేసి ఉంటే కచ్చితంగా మరో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు అదనంగా వచ్చేవి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ చిత్ర దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన కారుని బహుమానం గా ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలను సుజిత్ తన సోషల్ మీడియా ద్వారా అప్లోడ్ చేసి అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ సుజిత్ కి బహుకరించిన కారు పేరు ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్’. ఈ కారు కి ఒక చిన్న కథ ఉంది. ‘ఓజీ’ చిత్రం లోని కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయడం కోసం జపాన్ కి వెళ్లాల్సి ఉంది.
కానీ నిర్మాతలు ఇప్పటికే బడ్జెట్ బాగా పెరిగిపోయింది, ఇక మావల్ల కాదు అని చేతులు ఎత్తేయడం తో, ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి తగ్గకుండా, తానూ ఎంతో ఇష్టం గా కొనుగోలు చేసిన ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్’ కారు ని అమ్మేసి, వచ్చిన డబ్బులతో జపాన్ కి వెళ్లి కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేసుకొని వచ్చాడు. ఇలా ఎంత మంది డైరెక్టర్స్ ఉంటారు చెప్పండి?, తానూ నష్టపోయిన పర్వాలేదు, నా అభిమాన హీరో సినిమా గొప్ప గా ఉండాలి అని తపన పడి ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసు. అందుకే సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన కొన్ని నెలల తర్వాత, ఆయన స్వయంగా సుజిత్ ఇంటికి వెళ్లి ఈ కారుకి బహుమతిగా ఇచ్చి వచ్చాడు. అంతే కాదు ఓజీ సీక్వెల్ కి నువ్వు ఎన్ని డేట్స్ అడిగితే అన్ని ఇస్తాను, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నీకు సంపూర్ణంగా సహకరిస్తాను అని మాట కూడా ఇచ్చాడట. త్వరలోనే ఓజీ సీక్వెల్ కి సంబంధించిన అప్డేట్ ని మనం వినొచ్చు.