
Elephant Whispers -Guneet Monga : విజయం సాధిస్తే భుజం తట్టే చేతులు, చప్పట్లు కొట్టే చేతులు, శాలువాలు కప్పే చేతులు, పూల దండలు వేసే చేతులు ఎన్నో ఉంటాయి. అహో ఓహో అంటూ స్తుతి కీర్తనలు చేసే గొంతులు ఉంటాయి. భుజ కీర్తులు తగిలించే మనసులూ ఉంటాయి. అదే ఏదీ సాధించినప్పుడు ఎవరూ ఉండరు.. గునిత్ మోంగా ది కూడా ఇలాంటి నేపథ్యమే. ఎక్కడో ఢిల్లీలో పుట్టిన ఆమె.. ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు సాధించిందంటే మామూలు విషయం కాదు.. అవి డాక్యుమెంటరీలు కాబట్టి మీడియా పెద్దగా ప్రచారం ఇవ్వలేదు. అవే ఫీచర్ ఫిలిమ్స్ అయితే ఆమెకు దక్కే గౌరవం వేరే స్థాయిలో ఉండేది. అన్నట్టు ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కి ఆస్కార్ అవార్డు వచ్చేదాకా కూడా గునీత్ మోంగా అంటే ఎవరో మన మీడియాకు తెలియదు.
గునీత్ మోంగా తల్లిదండ్రులు దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. వీరికి ఢిల్లీలో ఒక ఇల్లు ఉండేది. కానీ ఈమె తోబొట్టువులు ఆస్తికోసం తగాదాపడేవారు. ఒకానొక దశలో గునీత్ ను సజీవ దహనం చేసేందుకు కూడా వెనకాడ లేదు. అయితే ఈమె తండ్రి ప్రతిఘటించడంతో వారు పారిపోయారు.. అంతేకాదు తల్లిని తిట్టారు. నాన్నను కొట్టారు.. ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి గునిత్ ముంబై వెళ్ళిపోయింది.. జీవితాన్ని కొత్తగా నిర్మించుకోవడం ప్రారంభించింది. గునిత్ అమ్మకు త్రిబుల్ బెడ్ రూమ్ లో ఉండాలని ఒక కల ఉండేది. దాన్ని నిజం చేసేందుకే ముంబై చేరుకుంది. వెన్న, జున్ను అమ్మే దగ్గర నుంచి, ఓ అనౌన్సర్, డీజే, యాంకర్… ఇలా డబ్బుల కోసం ఏదైనా చేసేది. క్రమక్రమంగా సినిమాలోకి వెళ్ళింది. సంపాదించిన ప్రతి పైసా కూడా తల్లిదండ్రులకు ఇచ్చింది. పొదుపు చేసిన సొమ్ము మొత్తం లెక్కపెట్టి ఒక ఇల్లు బుక్ చేసింది. ఇక ఇంట్లోకి వెళ్లడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ఆరునెలల వ్యవధిలో గొంతు క్యాన్సర్ తో అమ్మ, మూత్రపిండాలు విఫలమై నాన్న మృతి చెందారు.. దీంతో గునీత్ గుండె పగిలింది.
గునీత్ ఆ బాధలోనే తన శక్తి సామర్థ్యాల మీద మరింత నమ్మకం పెంచుకుంది. సినిమాల్లోకి వెళ్ళింది. “నేను ఎందుకు దర్శకురాలిని కావద్దు” అనే ప్రశ్న ఆమెలో మొదలైంది. రోజుకు గరిష్టంగా నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేది. ప్రతి సినిమాను ఒక ఛాలెంజ్ గా తీసుకుంది. క్రౌడ్ ఫండింగ్, ఇంటర్నేషనల్ సేల్స్ ఇలా ప్రతి ఛాలెంజ్ ను ఆస్వాదించింది.. ఏ ముంబై వీధుల్లో జున్ను, వెన్న అమ్మిందో.. ఆ వీధుల్లోనే బీఎండబ్ల్యూ కారులో తిరగడం ప్రారంభించింది. ఏ హోటల్ ముందు అయితే ఆకలితో ఇబ్బంది పడిందో… హోటల్లో కాంటినెంటల్ ఫుడ్ తినే స్థాయికి ఎదిగింది. ఇంత ఎత్తుకెదిగినప్పటికీ “మంచి పని చేసావ్ అమ్మా ” అని అమ్మ.. “శభాష్ బేటా” అని నాన్న.. అనే మెచ్చుకోలు తల్లిదండ్రుల నుంచి లేకపోవడంతో బాధపడేది. భౌతికంగా వారు ఉండి ఉంటే ఆ పని చేసే వారేమో.. కానీ అమ్మానాన్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. అంతేకాదు గునీత్ ను అమెరికా పంపించేందుకు ఆమె నాన్న బంగారు కడియాన్ని అమ్మేశాడు. ఇప్పటికీ దాన్ని తలుచుకుంటూ ఆమె కన్నీటి పర్యంతమవుతుంది.
ఆస్కార్ మెట్ల మీద నిలుచున్నప్పుడు.. డాల్బీ థియేటర్లో రెడ్ కార్పెట్ మీద నడుస్తున్నప్పుడు.. ది గ్యాంగ్స్ ఆఫ్ వసిపూర్, ది లంచ్ బాక్స్ వంటి సినిమాలు తీసినప్పుడు.. ఆమె సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టినప్పుడు.. పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్, ఎలిఫెంట్ విస్పారర్స్ కు ఆస్కార్ అవార్డులు అందుకుంటున్నప్పుడు.. ఇన్ని ఆనంద సందర్భాల్లో అమ్మానాన్న పక్కనే ఉండి ఉంటే ఎంతో బాగుండు అని అనుకుంటుంది. కానీ ఆమెకు తెలుసు వాళ్లు తిరిగి రాలేని లోకాలకు వెళ్లిపోయారని.. కానీ ఎప్పుడో ఒకప్పుడు వాళ్లను తిరిగి చూస్తానని ఆశ నాలో ఉంటుందని గునీత్ చెబుతోంది. అంతేకాదు ప్రస్తుతం నా జీవితంలో నేను బిజీగా ఉంటున్నా అని అంటున్న గునీత్…” నేను కలల్ని అరువు తెచ్చుకోవడం ఆగిపోయిన రోజు వాళ్లు మరింత ఆనందపడతారు” అని కన్నీటిని తుడుచుకుంటూ చెబుతోంది. అన్నట్టు ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కి ఆస్కార్ అవార్డు వచ్చేదాకా కూడా గునీత్ మోంగా అంటే ఎవరో మన మీడియాకు తెలియదు. 2019లో ఈమె తీసిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ డాక్యుమెంటరీ ఫిలింకు కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది. తీసింది డాక్యుమెంటరీ నా లేదా ఫీచర్ సినిమానా అనే కొలమానాలు పక్కన పెడితే మేల్ డామినేషన్ అధికంగా ఉండే సినిమా ఇండస్ట్రీలో ఒక స్త్రీ నిర్మాతగా మారటం, రెండు డాక్యుమెంటరీ ఫీలింస్ తీయడం, ఆస్కార్ అవార్డులు సాధించడం మామూలు విషయం కాదు. అన్నట్టు ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కి ఆస్కార్ అవార్డు వచ్చేదాకా కూడా గునీత్ మోంగా అంటే ఎవరో మన మీడియాకు తెలియదు.