Mahesh Babu and Rajamouli : రాజమౌళి (Rajamouli) లాంటి స్టార్ డైరెక్టర్ మహేశ్ బాబు (Mahesh Babu) తో కలిసి వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాతో వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా యావత్ ప్రపంచానికి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించాలనే ప్రయత్నంలో రాజమౌళి మహేష్ బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ అవ్వాలని యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు… ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది… ఇక వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని రాజమౌళి తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడట. అందులో భాగంగానే ఎక్కడా రెస్టు లేకుండా సినిమా షూటింగ్ ఫినిష్ చేయాలని షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది భారీ రికార్డులను సృష్టిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి అలాంటి సందర్భంలోనే ఈ సినిమా క్లైమాక్స్ ని చాలా డిఫరెంట్ గా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఒక సినిమాలో చాలామంది హీరోలు కామెడీ రోల్స్ పోషిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో ఇండియాలో ఉన్న టాప్ ఆర్టిస్టులందరిని భాగం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా జక్కన్న ఈ ప్లాన్ వేశాడు అంటే దాని వెనకాల ఏదో ఒక పెద్ద విషయం అయితే ఉండే ఉంటుంది. మరి తను ఈ సినిమాలో స్టార్ హీరోలందరిని ఎందుకు చూపించాలి అనుకుంటున్నాడు. తద్వారా ఆయన చేసే ప్లాన్ ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక తెలుగు నుంచి అయితే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఈ సినిమా చివర్లో కనిపించబోతున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది.
మరి ఈ ముగ్గురు హీరోలు కనక మహేష్ బాబు సినిమాలో కనిపించినట్లయితే ఆ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేయడంలో పెద్దగా విశేషం అయితే ఏమీ లేదని మరి కొంతమంది సినిమా అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఐతే మన స్టార్ హీరోల అభిమానుల మధ్య కొంతవరకు విభేదాలు వస్తున్న నేపథ్యంలో అందరు హీరోల్ని కలిపి స్క్రీన్ మీద చూపించి మేమంతా ఒక్కటే అని ప్రేక్షకులందరికి ఒక ట్రీట్ తో పాటు ఒక మెసేజ్ కూడా ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది..దీనివల్ల హీరోల అభిమానులు మధ్య ఇగోలు పోయి అందరి సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతుందని రాజమౌళి ఇలాంటి ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ విషయంపై రాజమౌళి ఎలా స్పందిస్తాడు అనేది…