https://oktelugu.com/

Bigg Boss Telugu 8: సంచాలక్స్ పృథ్వీకి అన్యాయం చేశారా..? పృథ్వీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన పునర్నవి,వితికా షేరు!

పృథ్వీ సంచాలక్స్ తో మాట్లాడుతూ 'నేను ఒక్కసారే కదా రూల్ ని అతిక్రమించాను, అందుకు ఒకటి తీసేసారు. మిగిలిన 9 నేను రూల్స్ పాటించే కదా డిస్కులు వేసాను. ఈ లెక్కన నాకు, నిఖిల్ కి డ్రా అవుతుంది. మీరు అతన్ని విన్నర్ గా ఎలా ప్రకటించారు' అని అడుగుతాడు పృథ్వీ.

Written By:
  • Vicky
  • , Updated On : November 29, 2024 / 09:21 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 : నిన్న జరిగిన ‘టికెట్ టు ఫినాలే’ టాస్కులను నిర్వహించడానికి సీజన్ 3 కంటెస్టెంట్స్ పునర్నవి, వితషేరు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు సంచాలక్స్ గా తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసారు కానీ, పాపం వీళ్ళ దురదృష్టం ఏంటో కానీ, అది చివరికి హౌస్ లో కాంట్రవర్సీ గా మారింది. ముఖ్యంగా ‘జారుతూ గెలువు’ టాస్కులో మాత్రం ఎందుకో వీళ్లిద్దరు కాస్త కన్ఫ్యూజ్ అయ్యారేమో అని అనిపించింది. ఈ టాస్క్ విన్నర్ గా నిఖిల్ నిలుస్తాడు.  టాస్క్ ఏమిటంటే , నూనె బ్లాక్ మీదుగా వెళ్తూ, స్లోపు వాలు మీదకు తాడు పట్టుకొని పైకి ఎక్కి, పైన ఉన్న డిస్కులను తీసుకొని తమ నెట్స్ లోకి ఒక లైన్ వద్ద నిల్చొని గురి చూస్తూ వెయ్యాలి. ఈ టాస్క్ లో వాస్తవానికి పృథ్వీ నిఖిల్ కంటే ఎక్కువ డిస్కులు వేస్తాడు.

    కానీ పృథ్వీ ఒక్కసారి నూనె బ్లాక్ మీదుగా కాకుండా, పక్కన నుండి వెళ్తాడు. నిఖిల్ 9 డిస్కులు తన నెట్ లో వేసుకోగా, పృథ్వీ 10 డిస్కులు వేస్తాడు. ఒక్కసారి నూనె బ్లాక్ మీదుగా వెళ్లనందుకు పృథ్వీ నెట్ లో ఉన్న 10 డిస్కుల నుండి ఒక డిస్క్ ని తీసేస్తాం అంటారు సంచాలక్స్. అప్పుడు నిఖిల్, పృథ్వీ మధ్య డ్రా అవుతుంది. కానీ సంచాలక్స్ మాత్రం రూల్స్ ని పూర్తిగా పాటించి ఆడిన నిఖిల్ ని విన్నర్ గా ప్రకటిస్తారు. అప్పుడు పృథ్వీ సంచాలక్స్ తో మాట్లాడుతూ ‘నేను ఒక్కసారే కదా రూల్ ని అతిక్రమించాను, అందుకు ఒకటి తీసేసారు. మిగిలిన 9 నేను రూల్స్ పాటించే కదా డిస్కులు వేసాను. ఈ లెక్కన నాకు, నిఖిల్ కి డ్రా అవుతుంది. మీరు అతన్ని విన్నర్ గా ఎలా ప్రకటించారు’ అని అడుగుతాడు పృథ్వీ. చూస్తుంటే ఇది చాలా న్యాయమైన వాదనగానే అనిపిస్తుంది కదూ.

    దీనికి సంచాలక్స్ సరిగా సమాధానం చెప్పలేకపోయారు. అవన్నీ కాదు రూల్స్ ని ఒక్కసారి కూడా బ్రేక్ చేయకుండా ఆడిన నిఖిల్ మాత్రమే విన్నర్ అని గట్టిగా చెప్తారు. ఇక్కడ పృథ్వీ కూడా ఎక్కువ వాదించకుండా వదిలేస్తాడు. తన స్నేహితుడు నిఖిల్ గెలిచాడు కాబట్టి సరిపోయింది, అదే అవినాష్, రోహిణి బ్యాచ్ లో సంచాలక్స్ ఇలా చేసి ఉంటే పృథ్వీ ఊరుకునే వాడా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ టాస్క్ తర్వాత బిగ్ బాస్ కన్ను ని అమర్చే ఫజిల్ లో పృథ్వీ మధ్యలో కాస్త అసహనం కి గురై గేమ్ ని ఉద్దేశపూర్వకంగానే వదిలేస్తాడు. ఈ టాస్క్ లో నిఖిల్ విన్నర్ అవ్వగా, గౌతమ్ రెండవ స్థానంలో నిలిచాడు. ఓవరాల్ గా నిఖిల్ రెండు టాస్కులు గెలిచినందుకు గానూ, టికెట్ టు ఫినాలే టాస్కు ని ఆడేందుకు వెళ్లిన మూడవ కంటెస్టెంట్ గా నిలిచాడు.