https://oktelugu.com/

Nani and Srikanth Odela : శ్రీకాంత్ ఓదెల నాని కాంబోలో రాబోతున్న గ్యాంగ్ స్టర్ మూవీ…నానితో వర్కౌట్ అవుతుందా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 29, 2024 / 09:17 AM IST

    Nani

    Follow us on

    Nani and Srikanth Odela : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక సోలో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాని తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు..ఇక తను ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటే ఆ సినిమా మీద పూర్తి డెడికేషన్ తో వర్క్ చేయగలిగే టాలెంటెడ్ హీరో కావడం విశేషం…

    సినిమా ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరో నాని… ఆయన స్టార్ హీరో రేంజ్ ను అందుకోవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే దీ ప్యారడైజ్ పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఆయన గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇప్పటివరకు నాని గ్యాంగ్ స్టర్ పాత్రని పోషించలేదు. మరి ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా నటించి ఎంతవరకు మెప్పిస్తాడనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా దసరా సినిమాలో ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ ను ట్రై చేసిన నాని ఈ సినిమాలో కూడా తనదైన రీతిలో తన స్లాంగ్ ను మార్చబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే లుక్కులో కూడా చాలా వరకు వేరియేషన్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది… ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనదైన రీతిలో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించడమే కాకుండా దసరాకు మించిన సినిమాలు చేస్తాను అని ముందే నాని అభిమానులకు మాటిచ్చాడు.

    కాబట్టి ఈ సినిమాతో నాని ని ఒక డిఫరెంట్ పాత్రలో చూపించి ఈ సినిమాని సక్సెస్ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దసరా సినిమాతో మొదటిసారి 100 కోట్ల క్లబ్ లో చేరిన నాని ఈ సినిమాతో దాదాపు 200 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    ఇక ఈ సినిమా ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకున్నప్పటికి రెగ్యులర్ షూటింగ్ కి మాత్రం ఇంకా వెళ్ళలేదు. కాబట్టి తొందర్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ కి వెళ్లి అతి తొందరలో ఈ సినిమాని కంప్లీట్ చేసి ప్రేక్షకులు ముందు ఉంచడానికి శ్రీకాంత్ ఓదెల తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా భారీ సక్సెస్ ని సాధించాలనే కాన్సెప్ట్ పెట్టుకొని వీళ్లిద్దరూ బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది…