Sai Pallavi Marriage: తెలుగు సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన నటీమణులు కొందరు ఉన్నారు వారిలో సాయిపల్లవి ప్రధానమైనది. తన నటనతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎంత పెద్ద హీరో అయినా ఆమె డామినేట్ చేస్తుంది. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంది. అందుకే ఆమెకు అవకాశాలు పుష్కలంగా వచ్చినా తనకు నచ్చిన పాత్రే చేస్తుంది. తనకు ఇష్టమైతేనే అంగీకారం తెలుపుతుంది. అంతేకాని అన్ని పాత్రలు చేస్తానని మాత్రం చెప్పదు. తనకు నచ్చిన పాత్ర చేసి మంచి మార్కులు కొట్టేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే తను చేసిన సినిమాలు తక్కువే అయినా గుర్తుండిపోయే పాత్రలు చేసి ప్రేక్షకులకు మరింత చేరవయింది.

కరోనా కాలంలో అమ్మానాన్నలు పెళ్లి చేయాలని ఒత్తిడి చేసినా తను మాత్రం అంగీకరించలేదు. తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పి తప్పించుకుంది. ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కోవడం తన వల్ల కాదని తేల్చింది. దీంతో తల్లిదండ్రుల మాటను కూడా కాదంది. కానీ వారు మాత్రం పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నారు. ఎవరికో ఒకరికి కట్టబెట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాను మాత్రం పెళ్లికి నో చెబుతోంది. ఇప్పుడే పెళ్లి వద్దని వారిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆమె ఓ తెలుగు హీరోతో ప్రేమలో పడిందనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. దీంతోనే అప్పుడే పెళ్లి వద్దని దాటవేస్తోందని తెలుస్తోంది. వారిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని అతడి కోసమే ఆమె సిద్ధంగా ఉందని సినీ వర్గాల భోగట్టా. అతడు కూడా ఒంటరిగానే ఉండటంతో ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే వివాహం వద్దని చెబుతోందనే రూమర్లు కూడా వస్తున్నాయి. సాయిపల్లవి తెలుగు హీరోతో ప్రేమలో ఉందని చెబుతున్నారు. అందుకే ఆయనతోనే వివాహం చేసుకోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఆయనతో ప్రేమలో ఉండటంతో వారు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జోరుగానే సాగుతోంది.

ఏది ఏమైనా సాయిపల్లవి తెలుగింటి కోడలు కాబోతోందా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. కానీ ఆమె మనసులో ఏముందో తెలియడం లేదు. ఆమె కుర్ర హీరోతో ప్రేమలో ఉండటంతో వారు పెళ్లి చేసుకోవడం ఖాయమనే తెలుస్తోంది. కానీ ఇంతవరకు వారిద్దరి నుంచి ఏకాభిప్రాయం అనే మాట రావడం లేదు. అందుకే వారు పెళ్లి చేసుకుంటారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి పెళ్లితో జీవితంలో స్థిరపడి మంచి సంసారం చేసుకునే గృహిణిగా ఉండాలనేదే తల్లిదండ్రుల ఆకాంక్ష. వారి కోరిక తీరుతుందో లేదో వేచి చూడాల్సిందే మరి.


