spot_img
HomeNewsChiranjeevi Congratulates To Major Team:మేజర్ టీం కి చిరు ప్రశంసలు... చంద్రుణ్ణి తాకినట్లుందన్న మహేష్!

Chiranjeevi Congratulates To Major Team:మేజర్ టీం కి చిరు ప్రశంసలు… చంద్రుణ్ణి తాకినట్లుందన్న మహేష్!

Chiranjeevi Congratulates To Major Team: మేజర్ మూవీ యూనిట్ పై మెగాస్టార్ ప్రశంసల కురిపించగా… ఆ చిత్ర నిర్మాత మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 3న విడుదలైన మేజర్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ముఖ్యంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ వీరుడి కథ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారని ప్రేక్షకులు అభినందిస్తున్నారు.

Chiranjeevi Congratulates To Major Team
Major

మేజర్ మూవీ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మేజర్ చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ”మేజర్ కేవలం చిత్రం కాదు, ఒక భావోద్వేగం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వీరుడి కథ. మేజర్ మూవీలో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ అద్భుతంగా ఆవిష్కరించారు. అందరూ చూడాల్సి చిత్రం. ఇలాంటి అర్థవంతమైన చిత్రం నిర్మించిన మహేష్ ని చూస్తుంటే గర్వంగా ఉంది. హీరో అడివి శేషు, దర్శకుడు శశి కిరణ్ తిక్కా, హీరోయిన్స్ సాయి మంజ్రేకర్, శోభిత దూళిపాళ్లకు కంగ్రాట్స్” అంటూ చిరంజీవి ట్విట్టర్ పోస్ట్ చేశారు.

Chiranjeevi Congratulates To Major Team
Chiranjeevi, Major Team

అలాగే మేజర్ టీమ్ చిరంజీవిని నివాసానికి వెళ్లి ఆయన్ని కలవడం జరిగింది. వారిని చిరంజీవి స్వయంగా అభినందించారు. మేజర్ మూవీని ఉద్దేశిస్తూ చిరంజీవి చేసినా కామెంట్స్ పట్ల మహేష్ స్పందించారు. ”చిరంజీవి సర్ కి కృతఙ్ఞతలు. మీ ప్రశంసలతో మేజర్ మూవీ టీమ్ చంద్రుణ్ణి తాకినంత ఆనందంగా ఉంది” అంటూ ట్వీట్ చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం మేజర్ చిత్రాన్ని ప్రశంసిస్తూ నోట్ విడుదల చేశారు.

Chiranjeevi Congratulates To Major Team
Pavan Kalyan

సోనీ పిక్చర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మించిన మేజర్‌ చిత్రానికి శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. 26/11 ముంబయి టెర్రరిస్ట్ ల దాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా మేజర్ తెరకెక్కింది. ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడవిశేష్‌ నటించారు. ఆయనకు జోడీగా సాయీ మంజ్రేకర్‌ నటించారు. విడుదలైన అన్ని భాషల్లో మేజర్ ఆదరణ దక్కిచుకుంది. మేజర్ వరల్డ్ వైడ్ రూ. 60 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version