Revanth Reddy: కెసిఆర్ కుర్చీ నే కాదు.. ఆయన అదృష్టాన్ని కూడా రేవంత్ లాక్కున్నారు

కెసిఆర్ అదృష్ట సంఖ్య 6. జాతకాలను, వాస్తు సిద్ధాంతాలను బాగా నమ్మే కేసీఆర్.. తాను చేపట్టే ప్రతి పనిలోనూ 6 ఉండేలాగా చూసుకుంటారు. 2018లో గెలిచిన తర్వాత దివ్యాంగులకు, ఇతరులకు అందించే ఆసరా పింఛన్లలో చివర ఆరు అనే సంఖ్య ఉండేలాగా చూసుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 6, 2023 7:12 pm

Revanth Reddy

Follow us on

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ భావించారు.. కాంగ్రెస్ ప్రకటించిన ఆర్ గ్యారంటీల కంటే మిన్నగా కెసిఆర్ భరోసా అనే మేనిఫెస్టో ప్రకటించారు.. అంతేకాదు ఈసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అందులో భాగంగానే రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున రాష్ట్రం మొత్తం దాదాపు పర్యటించారు. కానీ కెసిఆర్ ఒకటనుకుంటే.. తెలంగాణ ప్రజలు మరో విధంగా తీర్పు ఇచ్చారు. 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం.. అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే మీడియా సర్కిల్లో మాత్రం ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

కెసిఆర్ అదృష్టాన్ని కూడా లాక్కున్నారా

కెసిఆర్ అదృష్ట సంఖ్య 6. జాతకాలను, వాస్తు సిద్ధాంతాలను బాగా నమ్మే కేసీఆర్.. తాను చేపట్టే ప్రతి పనిలోనూ 6 ఉండేలాగా చూసుకుంటారు. 2018లో గెలిచిన తర్వాత దివ్యాంగులకు, ఇతరులకు అందించే ఆసరా పింఛన్లలో చివర ఆరు అనే సంఖ్య ఉండేలాగా చూసుకున్నారు. అంటే వితంతువులకు అందించే పింఛన్లను 2016, దివ్యాంగులకు అందించే పింఛన్లను 4016 కు పెంచారు. అంతేకాదు ఆ పింఛన్ల చివరిలో ఆరు అనే సంఖ్య ఉండేలాగా చూసుకున్నారు. అంతేకాదు కెసిఆర్ ఆయన వాడే వాహనాల పై ఉండే నెంబర్లలో కూడా ఆరు ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో కేసీఆర్కు ఆయన అదృష్ట సంఖ్య కలిసి రాలేదు. ఏ పని చేపట్టినా, ఈ కార్యక్రమం తలపెట్టినా తన అదృష్ట సంఖ్య 6 కలిసివచ్చేలా కెసిఆర్ పనులు చేసేవారు. అయితే ఈసారి ముహూర్త బలం, తిధులు, నక్షత్రాలు, శుభ ఘడియల పైనే ఎక్కువ ఆధారపడ్డారు. 9 ని తన అదృష్ట సంఖ్యగా భావించే రేవంత్ రెడ్డి సైతం ఈసారి అదృష్ట సంఖ్య ఆధారంగా కాకుండా ప్రకారమే ముందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన యాదృచ్ఛికంగా కెసిఆర్ లక్కీ నెంబర్ గా భావించే ఆరవ తేదీన నవంబర్ మధ్యాహ్నం 1: 45 నిమిషాల సమయం లో రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు. వాస్తు సిద్ధాంతం ఆరోజు ఆయనకు క్షేమతార బలం ఉంది. అటు కేసీఆర్ ఏమో తారాబలం ప్రకారం 9వ తేదీన రెండు నియోజకవర్గాల్లో నామినేషన్ వేశారు. ఇందుకోసం అనేకమంది వాస్తు సిద్ధాంతులను కేసీఆర్ సంప్రదించినట్టు తెలుస్తోంది..కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికల్లో గెలిచి రేవంత్ ముఖ్యమంత్రి అవుతుండగా.. నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా కొనసాగిన కెసిఆర్ మాజీ ముఖ్యమంత్రి అవుతున్నారు.

కెసిఆర్ ఎందుకు అలా చేసినట్టు

సాధారణంగా కెసిఆర్ ఆరవ నెంబర్ ను తన అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ఆయన చేసే ప్రతి పనిలోనూ ఆరు ఉండేలాగా చూసుకుంటారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆరు సంఖ్యను కాకుండా శుభ ఘడియలను, ముహూర్తాలను, నక్షత్రాలను నమ్ముకున్నారు. కాకపోతే అవి ఈసారి ఆయనకు కలిసి రాలేదు. చివరికి తన వ్యవసాయ క్షేత్రంలో చండి యాగం కూడా నిర్వహించారు. అయినప్పటికీ అవేవీ ఆయనను మూడోసారి ముఖ్యమంత్రిని చేయలేకపోయాయి. 6,9 మాత్రమే కాకుండా ఎనిమిదవ నెంబర్ తో రాష్ట్ర రాజకీయాలకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రాజశేఖర్ రెడ్డి ( జూలై), రేవంత్ రెడ్డి ( నవంబరు) ఇద్దరి పుట్టినరోజు ఎనిమిదవ తేదీనే. ఇక సీఎం కేసీఆర్ ( ఫిబ్రవరి) పుట్టినరోజు 17వ తేదీ. అవి రెండు కూడితే 8 వస్తుంది. కాగా, నవంబర్ ఆరవ తేదీన నామినేషన్ వేసి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అవుతున్న రేవంత్ రెడ్డి సీఎం కుర్చీనే కాకుండా.. కెసిఆర్ అదృష్టాన్ని కూడా లాక్కున్నారు.