Priyanka Chopra: ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ వీడియో.. వైరల్.. ఇంతకీ అందులో ఏముందంటే?

రష్మిక ఫేక్ వీడియో భారత ప్రభుత్వాన్ని కదిలించింది. సంబంధించిన అధికారులు విచారణ చేపట్టారు. కానీ డీప్ ఫేక్ వీడియో చేసిన వాళ్ళను కనిపెట్టలేకపోయారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మధ్యలోనే ఆగిపోయింది.

Written By: NARESH, Updated On : December 6, 2023 7:08 pm

Priyanka Chopra

Follow us on

Priyanka Chopra: డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ సెలెబ్స్ కి వణుకు పుట్టిస్తుంది. దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నా వీడియోలు ఆగడం లేదు. రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో ఇటీవల సంచలనం రేపింది. బ్రిటన్ కి చెందిన ఓ మహిళ బోల్డ్ వీడియో రష్మిక మందానకి చెందినదిగా వైరల్ చేశారు. ఒరిజినల్ అని నమ్మిన చాలా మంది నెటిజెన్స్ అది వైరల్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేశారు. ఏకంగా అమితాబ్ బచ్చన్ అది ఫేక్ అని ట్వీట్ చేయడంతో పలువురు రష్మికకు మద్దతుగా నిలిచారు.

రష్మిక ఫేక్ వీడియో భారత ప్రభుత్వాన్ని కదిలించింది. సంబంధించిన అధికారులు విచారణ చేపట్టారు. కానీ డీప్ ఫేక్ వీడియో చేసిన వాళ్ళను కనిపెట్టలేకపోయారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మధ్యలోనే ఆగిపోయింది. కొన్ని ఐటీ సంస్థలు సమాచారం ఇచ్చేందుకు నిరాకరించాయని సమాచారం. రశ్మికతో పాటు సీనియర్ హీరోయిన్ కాజోల్, అలియా భట్ డీప్ ఫేక్ వీడియోలు కూడా వచ్చాయి.

తాజాగా ప్రియాంక చోప్రా ఇందుకు బలైంది. ప్రియాంక ఓల్డ్ వీడియోను డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే ఈ వీడియో అసభ్యకరంగా లేదు. ఆమె ఓ ఫేక్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నట్లు వాయిస్ ఛేంజ్ చేశారు. గతంలో ప్రియాంక మాట్లాడిన వీడియో వాయిస్ మార్చి జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇది ప్రియాంక దృష్టికి వెళ్ళింది.

ఇలా అనేక మార్గాల్లో నేరగాళ్లు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలలో ఆడుకుంటున్నారు. ప్రియాంక ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా అక్కడే కాపురం పెట్టింది. ఆమె హాలీవుడ్ చిత్రాలను ఎక్కువగా చేస్తున్నారు. బాలీవుడ్ లో కొందరు తనకు ఆఫర్స్ రాకుండా చేశారని ప్రియాంక చోప్రా ఆరోపణలు చేసింది. ప్రియాంక చోప్రా సరోగసి పద్దతిలో ఓ అమ్మాయికి జన్మనిచ్చింది.