Ram Gopal Varma Vyuham: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంది. ఆయన నిర్వహిస్తున్న ‘వారాహి విజయ యాత్ర’ కార్యక్రమానికి జనాల నుండి అపూర్వమైన స్పందన లభిస్తుంది. ఏ ఇద్దరు మాట్లాడుతుకున్నా ఇప్పుడు ఈ యాత్ర గురించే మాట్లాడుతుకుంటున్నారు. వైసీపీ పార్టీ నాయకులూ కూడా తెలుగు దేశం పార్టీ కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రామ్ గోపాల్ వర్మ ని వాడుకొని పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా ఒక సినిమా చేయిస్తున్నాడు. ఆ చిత్రం పేరే ‘వ్యూహం’. ఇందులో పవన్ కళ్యాణ్ మరియు చంద్ర బాబు నాయుడు ని విలన్స్ గా చూపించి, జగన్ ని మహాత్ముడిగా చూపించబోతున్నారు. కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైంది. .ఇందులో ఆయన ఎక్కువగా చంద్ర బాబు నాయుడు పై నెగటివ్ చూపించాడు కానీ, అసలు పవన్ కళ్యాణ్ ని మాత్రం టీజర్ లో చూపించలేదు.
కానీ ఈ చిత్రం లో అధిక శాతం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. పవన్ కళ్యాణ్ మీద ఇప్పటి వరకు ప్రచారమైన వివాదాలు, ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వంటివి ప్రధాన అంశాలు గా తీసుకొని ఈ చిత్రానికి తెరకెక్కించాడట. పేరు కి ఇది జగన్ సినిమా కానీ, మొత్తం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చెయ్యడమే ప్రధానమైన లక్ష్యం అట.
త్వరలో విడుదల అవ్వబొయ్యే రెండవ టీజర్ మొత్తం పవన్ కళ్యాణ్ మీదనే ఉంటుందని సమాచారం. గతం లో కూడా రామ్ గోపాల్ వర్మ ఇలాగే పవన్ కళ్యాణ్ మీద ‘పవర్ స్టార్’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమాలో ఉండే నటీనటులే ఈ చిత్రం లో కూడా ఉంటారట. గతం లో పవర్ స్టార్ అనే చిత్రం పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహం ని వ్యక్తం చేసారు. రామ్ గోపాల్ వర్మ ని కొట్టడానికి ఇంటికి కూడా వెళ్లారు ఫ్యాన్స్. మరి ఈసారి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.