Ram Charan and Buchi Babu : సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా సక్సెస్ లు ఉంటేనే వాళ్లకు జనాల్లో క్రేజ్ ఉంటుంది. అలాగే మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది. లేకపోతే మాత్రం ఇంతకుముందు వాళ్లకు ఎన్ని సక్సెసులు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు వాళ్లకు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవేళ ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా వాళ్ళ మార్కెట్ అనేది భారీగా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్(Ram Charan)… ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేటు ఇమేజ్ ని కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ చేయబోతున్న సినిమాలు భారీ విజయాలను సాధించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక రీసెంట్ గా సంక్రాంతి కానుకగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో చరణ్ అభిమానులు కొంతవరకు నిరాశ చెందారు. మరి ఇకమీదట అలాంటి తప్పులు జరగబోవు అని రామ్ చరణ్ వాళ్ళకు మాటిచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకోసమే బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తూ ఎలాగైనా సరే ఈ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నంలో ఇటు రామ్ చరణ్, అటు బుచ్చిబాబు ఇద్దరు కూడా తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారట…ఇక రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూట్ అయితే స్టార్ట్ అయింది. మరి అందులో భాగంగానే ఈ సినిమాలో రామ్ చరణ్ గుడ్డివాడి పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఆ క్యారెక్టర్ లో గేమ్ చేంజర్ కోసమే గుడ్డివాడి క్యారెక్టర్ లో కొంతసేపు నటిస్తాడట. అయితే నిజంగా అతనికి సినిమాలో కళ్ళు కనిపించవా లేదంటే కావాలనే గుడివాడి పాత్రలో నటిస్తున్నాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా ‘రంగస్థలం ‘ (Rangasthalam) సినిమాలో చెవిటి వాడి పాత్రలో అదరగొట్టాడు.
ఇక ఇప్పుడు కండ్లు లేనివాడిగా నటిస్తూ మెప్పించడానికి రామ్ చరణ్ తన స్వాయ శక్తుల ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక బుచ్చిబాబు లాంటి దర్శకుడు రామ్ చరణ్ ని భారీగా ఎలివేట్ చేసి చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే రామ్ చరణ్ ని భారీ రేంజ్ లో చూపిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇప్పటికే బుచ్చిబాబుతో రామ్ చరణ్ ఎందుకు సినిమా చేస్తున్నాడు అంటూ కొంతవరకు నెగిటివిటీ అయితే వస్తుంది. ఎందుకంటే బుచ్చిబాబు ఇప్పటివరకు స్టార్ హీరోని హ్యాండిల్ చేసిన అనుభవమైతే లేదు. కాబట్టి రామ్ చరణ్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…