AP Rains: ఏపీకి మరో తుఫాన్ హెచ్చరిక. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.తూర్పు బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో.. ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఈ ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ చెబుతోంది.ఈ ఆవర్తనం క్రమంగా బలపడడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు పాటు ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా తీరంలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారితే భారీ వర్షపాతం నమోదు కానుంది.దీని ప్రభావంతో శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం, పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* ఆ రెండు రాష్ట్రాలపై ప్రభావం
వాస్తవానికి దానే తుఫాను ప్రభావం ఏపీలో పెద్దగా చూపలేదు. ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ పై మాత్రం విరుచుకుపడింది.భారీ వర్షాలు నమోదు కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు తీర ప్రాంత జిల్లాలను అల్లకల్లోలానికి గురిచేసాయి.దాదాపు 7 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.అయితే ఏపీపై ప్రభావం చూపుతోందని కేంద్రం హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఉత్తరాంధ్ర జిల్లాల వాడరేవుల్లో ప్రమాద హెచ్చరికలను సైతం జారీ చేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా యంత్రాంగం ఉండేది. కానీ దానే ప్రభావం చూపకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
* నాలుగు రోజులు పాటు వర్షాలు
అయితే తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తుఫానుగా మారి అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దీని ప్రభావంతో నాలుగు రోజులు పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం అప్రమత్తం అయ్యింది. జిల్లాల యంత్రాంగాలను అలర్ట్ చేసింది.