https://oktelugu.com/

Prabhas- Adipurush Pre Release Event: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ మందు త్రాగి వచ్చాడా..? సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్

సోషల్ మీడియా ప్రభాస్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుండో ఫ్యాన్ వార్స్ నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న ప్రభాస్ మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో మాట తూలడం మనం గమనించొచ్చు. ఆ భాగం వరకు వీడియో ని కట్ ని చేసి సోషల్ మీడియా లో సర్క్యూలేట్ చేసి వెక్కిరిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ త్రాగి వచ్చాడని, దేవుడి సినిమా ఈవెంట్ కి కూడా త్రాగి రావాలా?, ఒక్క మూడు గంటలు కూడా ఆపుకోలేవా అంటూ ప్రభాస్ పై కామెంట్స్ చేస్తున్నారు.

Written By: , Updated On : June 7, 2023 / 01:57 PM IST
Prabhas- Adipurush Pre Release Event

Prabhas- Adipurush Pre Release Event

Follow us on

Prabhas- Adipurush Pre Release Event: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న తిరుపతి లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. నిన్న తిరుపతి మొత్తం శ్రీరామ నామం తో ప్రతిధ్వనించింది. ఎక్కడ చూసిన రామ నామమే, ఎక్కడ చూసిన రాముడి జండాలే. శ్రీ రాముని ఉత్సవాలు ఎన్నో జరిగాయి, కానీ అవి శ్రీరామ నవమి రోజున మాత్రమే జరిగేవి.

అలాంటిది నవమి రోజు కాకుండా, మామూలు రోజుల్లో శ్రీరాముని వైభోగం ఒక రేంజ్ లో కనపడింది మాత్రం ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే. ఇకపోతే ఈ ఈవెంట్ లో ప్రభాస్ ఫ్యాన్స్ తో ఎంతో సరదాగా మాట్లాడాడు. సాధారణంగా ఈవెంట్స్ లో తక్కువగా మాట్లాడే అలవాటు ఉన్న ప్రభాస్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం అభిమానులతో మమేకమై మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే స్టార్ హీరో అన్న తర్వాత పాజిటివిటీ ఎంత ఉంటుందో, నెగటివిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది.

సోషల్ మీడియా ప్రభాస్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుండో ఫ్యాన్ వార్స్ నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న ప్రభాస్ మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో మాట తూలడం మనం గమనించొచ్చు. ఆ భాగం వరకు వీడియో ని కట్ ని చేసి సోషల్ మీడియా లో సర్క్యూలేట్ చేసి వెక్కిరిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ త్రాగి వచ్చాడని, దేవుడి సినిమా ఈవెంట్ కి కూడా త్రాగి రావాలా?, ఒక్క మూడు గంటలు కూడా ఆపుకోలేవా అంటూ ప్రభాస్ పై కామెంట్స్ చేస్తున్నారు.

మరో పక్క ప్రభాస్ ఫ్యాన్స్ దీనికి కౌంటర్ ఇస్తూ, ప్రభాస్ స్టేజి మీదకి ఎక్కేటప్పుడు కూడా చెప్పులు ధరించలేదు, అది ఆయన దేవుడికి ఇచ్చే విలువ, ఇలా మీరు ఎన్ని అసత్య వార్తలు ప్రచారం చేసిన , ప్రభాస్ అంటే ఏమిటో కోట్లాది మంది ప్రజలకు తెలుసు, కాబట్టి సమయం వృథా చేసుకోకండి అంటూ కౌంటర్లు ఇచ్చారు.