Pushpa 2: RRR రికార్డు ని డబుల్ మార్జిన్ తో కొట్టిన ‘పుష్ప : ది రూల్’..ఇది ఆరంభం మాత్రమే!

అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అంటే ఇక ఏ రేంజ్ అంచనాలు అభిమానుల్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వడం, ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ ట్విస్టులు ఇవ్వడం అనేది సుకుమార్ కి వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమా విషయం లో కూడా అదే చేసాడు. గ్లిమ్స్ వీడియో కంటే కూడా, ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఆల్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

Written By: Vicky, Updated On : June 7, 2023 3:12 pm

Pushpa 2

Follow us on

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తెలుగు లో మాత్రమే కాకుండా , హిందీ , తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. బాహుబలి మరియు KGF సిరీస్ తర్వాత ఆ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిన ఏకైక టాలీవుడ్ చిత్రం ఇదే.

అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అంటే ఇక ఏ రేంజ్ అంచనాలు అభిమానుల్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వడం, ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ ట్విస్టులు ఇవ్వడం అనేది సుకుమార్ కి వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమా విషయం లో కూడా అదే చేసాడు. గ్లిమ్స్ వీడియో కంటే కూడా, ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఆల్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక పుష్ప సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో ఈ స్థాయి రీచ్ రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి పాటలు. దేవిశ్రీప్రసాద్ అందించిన ట్యూన్స్ , యావత్తు భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసింది. పెద్ద పెద్ద క్రికెటర్ల దగ్గర నుండి సినిమా స్టార్స్ వరకు ప్రతీ ఒక్కరు ఈ పాటలకు డ్యాన్స్ వేస్తూ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ పెడుతూ ఉండేవారు. ఆ రేంజ్ లో హిట్ అయ్యాయి కాబట్టే ఇప్పుడు ‘పుష్ప : ది రూల్’ ఆడియో రైట్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో అమ్ముడుపోయాయి. ఒక ప్రముఖ ఆడియో సంస్థ సుమారుగా 65 కోట్ల రూపాయిలు వెచ్చించి రైట్స్ మొత్తాన్ని కొనుగోలు చేసిందట. ఇప్పటి వరకు అత్యధిక రేట్ కి అమ్మడుపోయిన ఆడియో రైట్స్ సినిమాగా #RRR చిత్రం నిలిచింది.

ఈ సినిమా ఆడియో రైట్స్ ని సుమారుగా 30 కోట్ల రూపాయలకు అమ్మారట.ఇప్పుడు ఆ రికార్డు ని ‘పుష్ప : ది రూల్’ చిత్రం డబుల్ మార్జిన్ తో బ్రేక్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, రాబొయ్యే రోజుల్లో పుష్ప పెట్టే రికార్డ్స్ ని చూసి, ఆ తర్వాత ఏ సినిమా రికార్డు కొట్టిన ‘నాన్ పుష్ప’ అని పిలవాల్సిందే అని అంటున్నారు ఫ్యాన్స్.